నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ తిరుపతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి వివిధ రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ మరియు డిప్యూటేషన్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఉన్నాయి. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 42 పోస్టులు భర్తీ చేస్తుండగా , ఇందులో అత్యధికంగా 12 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
ఈ ఆర్టికల్ ద్వారా మీకు మేము జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఎంపిక విధానము జీతము అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన వివరాలన్నీ తెలియజేస్తున్నాం.. మిగతా ఉద్యోగాల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.
✅ Download Notification – Click here
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
జూనియర్ అసిస్టెంట్ మొత్తం పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
✅ Join Our Telegram Group – Click here
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు :
- నోటిఫికేషన్ లో తెలియజేసిన ప్రకారం ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 5.5 CGPA పాయింట్లు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు అర్హులు.
- MS Word, MS Excel, MS పవర్ పాయింట్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో మంచి నైపుణ్యం ఉండాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు 200/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఆన్లైన్ అప్లికేషన్ తేదీ వివరాలు :
- అర్హత అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో జూలై 14 వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీలోపు అప్లై చేయాలి.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలు ఎంపిక విధానంలో ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ లను నిర్వహించి ఎంపిక చేస్తారు.
✅ Download Notification – Click here