ఏపీలో కొత్త రేషన్ కార్డులు – వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు | అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే | AP New Ration Cards latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకుగాను అవకాశం కల్పించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నూతన రేషన్ కార్డులకు సంబంధించి ఎవరు అర్హులు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన ముఖ్యమైన పత్రాలు ఏమిటి? మరియు సింగిల్ వుమెన్ / సింగిల్ మెన్ కు రేషన్ కార్డ్ ఇస్తారా వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🔥 రైస్ కార్డు యొక్క అర్హత ప్రమాణాలు: నూతన రైస్ కార్డ్ పొందాలి అనుకుంటున్నారు ఈ క్రింది అర్హతలను మరియు ప్రామాణికాలను కలిగి ఉండాలి. 

రైస్ కార్డ్ పొందాలి అనుకుంటున్న కుటుంబ సభ్యుల ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో అయితే 1,20,000 పట్టణాల్లో అయితే 1,44,000 పరిధిలోపు ఉండాలి.

గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిర్దేశించబడిన ఆరు అంచెల విధానం (SIX STEP VALIDATION) ప్రమాణాలను కలిగి ఉండాలి. ఆరు ఇంచుల విధానం అనగా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి గాని, ఆదాయపన్ను చెల్లించేవారు గానీ, నాలుగు చక్రాలు వాహనాన్ని గాని కలిగి ఉండరాదు.

GSWS యొక్క హౌస్ హోల్డ్ డేటా బేస్ నందు నమోదయి ఉండాలి.

🔥 అవసరమగు ధ్రువపత్రాలు: దరఖాస్తుదారుడు వారు ఏ విధమైన రేషన్ కార్డ్ సర్వీస్ పొందాలి అనుకుంటున్నారు దానికి తగిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలి.

నూతన రేషన్ కార్డ్ పొందుట కొరకు:

పైన పేర్కొన్న అర్హత ప్రమాణాలు కలిగి ఉండి, గతంలో ఏ రేషన్ కార్డు లోను పేరు లేని వారు వారి యొక్క ఆధార్ కార్డులను ధ్రువపత్రాలుగా సమర్పించడం ద్వారా నూతన రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రేషన్ కార్డ్ లో సభ్యుని చేర్చటం కొరకు :

రేషన్ కార్డులో సభ్యులు చేర్చుట కొరకు రెండు ఆప్షన్లు కలవు ఒకటి వివాహం ద్వారా, మరొకటి జననం ద్వారా సభ్యుణ్ణి రేషన్ కార్డులో చేర్చవచ్చు.

వివాహం ద్వారా సభ్యుణ్ణి చేర్చాలి అంటే సంబంధిత వివాహ ధ్రువీకరణ పత్రము మరియు వివాహం సమయంలో దంపతుల యొక్క ఫోటో కలిగి వుండాలి.

జననం ద్వారా సభ్యుణ్ణి చేర్చాలి అంటే జనన ధ్రువీకరణ పత్రము కలిగి ఉండాలి.

రేషన్ కార్డులో సభ్యుని చేర్చుట కొరకు ఆ సభ్యుని యొక్క ఆధార్ కార్డు మరియు ఇప్పటికే ఆ రేషన్ కార్డులో ఉన్న వ్యక్తి యొక్క ఆధార్ కార్డు కచ్చితంగా కలిగి ఉండాలి. 

రేషన్ కార్డ్ ను విభజించుట కొరకు :

రేషన్ కార్డులో సభ్యులు విడదియుట అనేది అందరికీ వీలుపడదు.

రేషన్ కార్డులో రెండు కుటుంబాలు అనగా పెండ్లి కాబడిన రెండు కుటుంబాలు ఉంటే రేషన్ కార్డును విడదీయుటకు అవకాశం ఉంటుంది.

ఇందుకుగా ను ఈ కుటుంబానైతే వేరుగా విభజించాలి అనుకుంటున్నారో ఆ కుటుంబానికి చెందిన వివాహ ధ్రువీకరణ పత్రం మరియు సభ్యులందరి ఆధార్ కార్డులు ఉండాలి.

రేషన్ కార్డ్ లో సభ్యుని తొలగించుట కొరకు :

ఒక రేషన్ కార్డులో ఎవరైనా మరణించిన సభ్యులు ఉన్నప్పుడు మాత్రమే ఆ రేషన్ కార్డులో ఆ సభ్యున్ని తొలగించడం అవుతుంది.

మరణించిన సభ్యుని యొక్క మరణ ధ్రువీకరణ పత్రము మరియు ఆధార్ కార్డు ఉండాలి. 

ప్రస్తుత కుటుంబంలో గల వ్యక్తి లేదా కుటుంబ పెద్ద యొక్క ఆధార్ కార్డు కూడా అవసరమగును.

రేషన్ కార్డ్ లో చిరునామా మార్చుట కొరకు :

రేషన్ కార్డులో చిరునామా మార్చుట కొరకు ప్రస్తుతం అవకాశం కల్పించి ఉన్నారు ఇందులో భాగంగా వేరొక సచివాలయం లో ఉన్న రేషన్ కార్డును ఇంకొక సచివాలయం కు అడ్రస్ మార్చగలరు. 

రేషన్ కార్డులో ఉన్న చిరునామాను మార్చాలి అంటే రేషన్ కార్డు కలిగియున్న కుటుంబ పెద్ద యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి.

రేషన్ కార్డులో ఉన్న సభ్యులు యొక్క అందరి ఆధార్ కార్డులు అవసరం అగును. 

రేషన్ కార్డ్ లో తప్పుగా ఉన్న ఆధార్ సీడింగ్ సవరించడం కొరకు : 

రేషన్ కార్డులో ఉన్న సభ్యుని యొక్క ఆధార్ వివరాలు తప్పుగా నమోదయి ఉంటే వారి యొక్క వివరాలను ఆధార్ సీడింగ్ సవరించడం ద్వారా సరిచేసుకోవచ్చు. 

ఇందుకుగాను ఏ సభ్యుని యొక్క ఆధార్ కార్డు వివరాలు మార్చాలనుకుంటున్నారో ఆ సభ్యుని ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డులో ఉన్నకుటుంబ పెద్ద/కుటుంబ సభ్యుని ఆధార్ కార్డు అవసరం అగును.

🔥 నోట్ :

రేషన్ కార్డులో పై సర్వీసులు పొందాలి అనుకుంటున్న వారు తప్పనిసరిగా వారి యొక్క సొంత గ్రామ లేదా వార్డు సచివాలయం నందు సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు ఇందుకుగాను 24 రూపాయల సర్వీస్ ఛార్జ్ ను  వసూలు చేస్తారు.

సంబంధిత ధ్రువపత్రాలు తీసుకుని వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకున్న తర్వాత గ్రామ వార్డు సచివాలయంలో గల డిజిటల్ అసిస్టెంట్ గ్రామ రెవెన్యూ అధికారి పంచాయతీ సెక్రెటరీ మహిళా పోలీసుల వద్ద కుటుంబ సభ్యులందరూ కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న నెంబర్ ద్వారా 3 రోజుల లోగా  ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే రేషన్ కార్డు దరఖాస్తు ముందుకు వెళుతుంది.

ముందుగా గ్రామ రెవెన్యూ అధికారి వారి వెరిఫై చేశాక మండల తాసిల్దారు వారు అప్రూవల్ ద్వారా రేషన్ కార్డులు పొందవచ్చు.

ఇందుకు గాను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా 180 రోజులు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ గా నిర్ధారించారు.

🔥 ఒంటరి మహిళ లేదా ఒంటరి పురుషునికి రేషన్ కార్డు లభిస్తుందా ? :

రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి మహిళ లేదా ఒంటరి పురుషునికి కొన్ని ప్రత్యేక అంశాల ప్రాతిపదికన మాత్రమే నూతన రేషన్ కార్డు కొరకు అవకాశం కల్పించారు. 

50 సంవత్సరాల వయసు దాటియుండి, కుమారుడు కుమార్తెలు లేదా పిల్లలు లేనటువంటి వారు కి ప్రత్యేక ప్రాతిపాదికన ఒంటరి మహిళ లేదా ఒంటరి పురుషుని రేషన్ కార్డు మంజూరు చేస్తారు. 

🔥 రేషన్ కార్డ్ EKYC పూర్తి చేసుకున్నారా ? :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ ఈ కేవైసీ నమోదు చేసుకోమని రెండు నెలల క్రితమే పౌరులకు కోరింది ఇప్పటివరకు 95% పైగా వేసి EKYC నమోదు చేసుకున్నారు.

ఇంకా నమోదు చేసుకోని వారు వీలైనంత త్వరగా కోరారు. 

80 సంవత్సరాల వయసు దాటిన వృద్ధులకు మరియు ఒక సంవత్సరం లోపు పిల్లలకు EKYC నమోదు నుండి మినహాయింపు జరిగింది.

రేషన్ కార్డ్ EKYC నమోదు కొరకు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి గడువు తేదీని పెంచారు. 

జూన్ 30వ తేదీలోగా EKYC నమోదు చేసుకొని వారు, తప్పనిసరిగా EKYC నమోదు నమోదు చేసుకోవాలి.

🔥 వాట్సాప్ ద్వారా రేషన్ కార్డ్ కి దరఖాస్తు చేసుకోండి ? :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా రేషన్ కార్డుకి సొంతంగా దరఖాస్తు చేసుకునేందుకుగాను అవకాశం కల్పిస్తుంది.

మే 15వ తేదీ నుంచి పౌరులు సొంతంగా మన మిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

9552300009 నెంబర్ ను సేవ్ చేసుకొని, Hi అని మెసేజ్ పంపి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన 7 రకాల రేషన్ కార్డ్ సర్వీసులను పొందవచ్చు.

🔥 జూన్ నుండి స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ :

జూన్ నెల నుండి నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియచేసారు.

గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఉచితంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేస్తారు.

🔥 గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవద్దు :

గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్న వారు మరియు రేషన్ కార్డ్ లో వివిధ మార్పులు చేర్పులు చేసుకొని పెండింగ్ ఉన్న దరఖాస్తు దారులు మరలా నూతనంగా దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదు అని మంత్రి గారు తెలియచేసారు.

గత ప్రభుత్వ హాయంలో పెండింగ్ లో ఉన్న 3.36 లక్షల దరఖాస్తులను వెరిఫై చేసి, అర్హులు ఉంటే, ఆ దరఖాస్తులను ఆమోదిస్తామని మంత్రి గారు తెలియచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!