ఇక నుండి పదో తరగతి పరీక్షలు సంవత్సరానికి రెండు సార్లు | CBSE 10th Class Exams

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారత ప్రభుత్వం అధీనం లో గల ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల కొరకు ఏర్పడిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) , 10వ తరగతి విద్యార్థుల పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

నూతన విద్యా విధానం ద్వారా సిఫార్సు చేసిన ప్రతిపాదనలు ను CBSE ఆమోదించింది.

ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.

🔥CBSE 10 వ తరగతి పరీక్షలు ప్రతి ఏటా రెండు సార్లు :

  • CBSE వారు 2026 విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి పరీక్షలను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించనున్నారు.
  • మొదటి దశ పరీక్షలను ఫిబ్రవరి లోనూ మరియు రెండవ దశ పరీక్షలను మే నెలలో జరుపుతారు.
  • ఈ పరీక్షా విధానంలో సప్లిమెంటరీ పరీక్షలు ఉండవని , రెండో దశ పరీక్షలనే సప్లిమెంటరీ పరీక్షలు గా పరిగణించనున్నారు.
  • మొదటి దశ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ నెలలోను , రెండవ దశ పరీక్ష ఫలితాలను జూన్ నెలలో విడుదల చేస్తారు.
  • విద్యార్థులు అందరూ మొదటి దశ పరీక్షలను తప్పనిసరిగా రాయాలి అని , రెండవ దశ పరీక్షలు కు అందరూ హాజరు కావలసిన అవసరం లేదు.
  • మొదటి దశలో వచ్చిన మార్కుల మెరుగుదల కోసం ఎవరైనా పరీక్ష రాయాలి అనుకున్న వారు రెండవ దశ పరీక్షలను రాయవచ్చు.
  • సామాన్య శాస్త్రం , గణితం , సాంఘిక శాస్త్రం , లాంగ్వేజ్ లలో ఏవైనా మూడు సబ్జెక్ట్ లను ఎంపిమ చేసుకొని , రెండవ దశ లో పరీక్ష రాయడానికి అవకాశం కల్పించారు.
  • ఈ నూతన విధానాన్ని 2026 విద్యా సంవత్సరం నుండి అమలు చేయనున్నట్లు CBSE చైర్మన్ రాహుల్ సింగ్ గారు తెలియచేసారు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *