కుటుంబ వార్షికాదాయం తక్కువగా ఉండి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక మంచి స్కాలర్షిప్ స్కీం తీసుకొచ్చింది. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్ష ప్రోత్సాహన్ యోజన పథకం కింద ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ఈ పథకానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? స్కాలర్షిప్ ఎంత ఇస్తారు ? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకునేందుకు పూర్తిగా ఈ ఆర్టికల్ చదవండి..
🏹 Join Our Telegram Group – Click here
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి సెంట్రల్ మెరిట్ స్కాలర్షిప్ :
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 82,000 మందికి స్కాలర్షిప్ ఇవ్వనున్నారు.
ఈ స్కాలర్షిప్ కు ఉండవలసిన అర్హతలు :
- ఇంటర్లో 80% కు పైగా మార్కులు వచ్చి ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షల లోపు ఉండాలి.
- ప్రతి సంవత్సరం 50% మార్కులు 70% హాజరు తప్పనిసరి.
- ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఉండాలి.
ఈ స్కాలర్షిప్ కి అప్లై చేయడానికి ఉండవలసిన వయస్సు :
- వయసు 18 నుండి 20 సంవత్సరాలు మధ్య ఉండాలి.
స్కాలర్షిప్ వివరాలు :
- ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇప్పిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో సంవత్సరానికి 20వేల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తారు.
- ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్నట్లయితే నాలుగవ సంవత్సరం మరియు 5వ సంవత్సరంలో సంవత్సరానికి 20వేల రూపాయలు చొప్పున స్కాలర్షిప్ ఇస్తారు.
🏹 Apply Scholoarship – Click here