ఇంటర్ తర్వాత ఈ కోర్సు చేస్తే పుష్కలమైన ఉద్యోగాలు – బి.ఎస్సీ నర్సింగ్ | AP Bsc Nursing Entrace Test | NTR University B. Sc Nursing Admissions

బి.ఎస్సీ నర్సింగ్ (AP Bsc Nursing Entrace Test
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రస్తుత రోజులలో నర్సింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇందుకు గాను నర్సింగ్ విద్య పై విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ వచ్చే విద్యా సంవత్సరం నుండి బి.ఎస్సీ నర్సింగ్ లో ప్రవేశాల కొరకు ప్రత్యేక పరీక్ష నిర్వహించేందుకు గాను నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఇందులో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ , ఆంధ్ర ప్రదేశ్ వారి నుండి APNCET – 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలుగు సంవత్సరాల బి.ఎస్సి నర్సింగ్ కోర్స్ పూర్తి చేసేందుకు గాను AP NCET తప్పనిసరి.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ మొత్తం చివరి వరకు చదవగలరు.

🔥బి.ఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్ర ప్రదేశ్ నుండి తొలిసారిగా నోటిఫికేషన్ విడుదలైంది.

🔥బి.ఎస్సీ నర్సింగ్ మొత్తం సీట్ల వివరాలు:

  • 254 కాలేజ్ లలో మొత్తం 13726 సీట్లు కలవు.
  • ఇందులో కంపెటైంట్ అథారిటీ సీట్లు 8576 కాగా , మేనేజ్మెంట్ సీట్లు 5150 కలవు.

🔥బి.ఎస్సీ నర్సింగ్ కోర్సు విద్యార్హత :

  • బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుగా కలిగి వున్న ఇంటర్మీడియట్ / ఇంటర్మీడియట్ (బై.పి.సి) ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
  • విద్యార్హత లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్పనిసరి గా వుండాలి.
  • బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో ఓసి అభ్యర్థులు 40 శాతం మార్కులు & మిగతా అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాలి.

🔥 వయస్సు: 

  • 31/12/2025 నాటికి 17 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.
  • గరిష్ఠ వయోపరిమితి ఏమి లేదు.

🔥బి.ఎస్సీ నర్సింగ్ కోర్సు దరఖాస్తు విధానం :

  • ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న వారు ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైట్ ద్వారా 28/05/2025 నుండి 20/06/2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

🔥బి.ఎస్సీ నర్సింగ్ దరఖాస్తు ఫీజు :

  • ఓసి అభ్యర్థులు 1180/- రూపాయలు & బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 944/- రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

🔥బి.ఎస్సీ నర్సింగ్ ఎంపిక విధానం :

  • ఆన్లైన్ విధానం లో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష లో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥బి.ఎస్సీ నర్సింగ్ వ్రాత పరీక్ష విధానం :

  • కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష లో మొత్తం 5 సెక్షన్లు కలవు. ఇందులో నర్సింగ్ ఆప్టిట్యూడ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ,ఇంగ్లీష్ సబ్జెక్టుల నుండి 20 ప్రశ్నలు చొప్పున 100 బహులైచ్చిక ప్రశ్నలు వుంటాయి.
  • ఒక్కో ప్రశ్న కి 1 మార్క్ చొప్పున 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 2 గంటల సమయం లభిస్తుంది.
  • ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో పరీక్ష నిర్వహిస్తారు.
  • వ్రాత పరీక్ష 06/07/2025 నాడు నిర్వహిస్తారు.

🔥 హెల్ప్ డెస్క్ :

  • ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసే విషయంలో ఎవరికైనా సందేహాలు సమస్యలు ఎదురైతే వారు   హెల్ప్ డెస్క్ కు సంప్రదించవచ్చు.
  • Technical problems contact details: 9000780707,8008250842 Email ID: ap.uhs.support@aptonline.in
  • Regarding Eligibility / Regulations: 8978780501, 9391805245

🔥 ముఖ్యమైన తేదీలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 28/05/2025 (ఉదయం 11:00 గంటల నుండి)
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 20/06/2025 (సాయంత్రం 06:00 గంటల వరకు)
  • హాల్ టికెట్లు డౌన్లోడ్  చేసుకొనుట: 25/06/2025 ఉదయం 10:00 గంటల నుండి
  • ఆన్లైన్ వ్రాత పరీక్ష నిర్వహణ తేది: 06/07/2025 ఉదయం 10:00 గంటల నుండి 12:00 గంటల వరకు

👉 Click here to download Notification

👉 Click here for official website 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *