ఇంజనీరింగ్ లో టాప్ కాలేజీల్లో సీటు రావాలంటే మీకు ఇలా ర్యాంక్స్ రావాలి | AP Top Engineering Colleges | AP EAPCET Counseling Dates

AP EAPCET Counseling Dates 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి AP EAPCET పరీక్ష కూడా రాసిన విద్యార్థులు ప్రస్తుతం కౌన్సిలింగ్ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు.

AP EAPCET ఫలితాలు మరియు ర్యాంకులు కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఈ ర్యాంకులు చూసుకున్న తర్వాత విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కాలేజీలో సీటు పొందడం ద్వారా ఇంజనీరింగ్ పూర్తయ్యే సమయానికి క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం కూడా పొందవచ్చు. కాబట్టి విద్యార్థులు రాష్ట్రంలో ఉన్న టాప్ కాలేజీల్లో సీటు రావాలని కోరుకుంటున్నారు.

ఈ ఆర్టికల్ ద్వారా మీకు గతంలో AP EAPCET లో వచ్చిన ర్యాంకులు, విద్యార్థులు ఏ కాలేజీలో సీట్లు పొందారు అని వివరాలు ఆధారంగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కాలేజీల్లో CSE బ్రాంచ్ లో సీటు పొందాలి అంటే ఎంత ర్యాంకు రావాలి అనేది మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇస్తున్న సమాచారం మీకు అవగాహన కోసం మాత్రమే తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం జరిగే కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య వారికి వచ్చినటువంటి ర్యాంకులు వంటి అంశాలు ఆధారంగా కాస్త మార్పులు ఉండవచ్చు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం (విశాఖపట్నం) : (AP EAPCET)

ఈ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో మాత్రమే కాదు దేశంలోనే పురాతనమైన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉన్న ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో CSE బ్రాంచ్ లో జనరల్ విభాగంలో సీటు పొందాలి అంటే AP EAPCET లో ఒకటి నుండి వెయ్యి లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి.

JNTU కాకినాడ : (AP EAPCET)

కాకినాడలో ఉన్న జేఎన్టీయూ లో ఇంజనీరింగ్ లో జనరల్ కేటగిరి లో CSE బ్రాంచ్ లో సీటు రావాలి అంటే AP EAPCET లో 1 నుండి 1500 లోపు ర్యాంకు వచ్చి ఉండాలి.

ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ (విశాఖపట్నం) : (AP EAPCET)

ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ వుమెన్ లో జనరల్ కేటగిరీలో CSE బ్రాంచ్ లో సీటు పొందాలి అంటే AP EAPCET లో విద్యార్థి యొక్క ర్యాంక్ లో ఒకటి నుండి 2,500 లోపు వచ్చి ఉండాలి..

గాయత్రీ విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (విశాఖపట్నం) : (AP EAPCET)

రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ కళాశాల కూడా ఉంది. విశాఖపట్నంలో ఉన్న ఈ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో జనరల్ కేటగిరీలో CSE బ్రాంచ్ లో సీటు పొందాలి అంటే ఒకటి నుండి నాలుగు వేల రూపాయలు కు వచ్చి ఉండాలి.

RVR & JC ఇంజనీరింగ్ కాలేజ్ : (AP EAPCET)

గుంటూరులో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ కళాశాల కూడా ఉంది. ఈ కళాశాలలో ఇంజనీరింగ్ లో CSE లో జనరల్ కేటగిరీలోనే సీటు రావాలి అంటే ర్యాంక్ 5000 లోపు వచ్చి ఉండాలి.

SRKR ఇంజనీరింగ్ కళాశాల (భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా) : (AP EAPCET)

ఈ కళాశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం ప్రాంతంలో ఉంది. ఈ కళాశాలలో కూడా సీటు పొందాలి అని విద్యార్థులు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కళాశాలలో జనరల్ కేటగిరి లో CSE బ్రాంచ్ లో సీటు పొందాలి అంటే AP EAPCET ర్యాంక్ 6000 లోపు వచ్చి ఉండాలి..

VIT – AP యూనివర్సిటీ : (AP EAPCET)

VIT – AP యూనివర్సిటీ లో మీరు ఇంజనీరింగ్ లో CSE లో జనరల్ కేటగిరీలో సీటు పొందాలి అంటే AP EAPCET లో ర్యాంక్ 7000 లోపు వచ్చి ఉండాలి.

విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (గుంటూరు) : (AP EAPCET)

రాష్ట్రంలో గుంటూరులో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కాలేజ్ కూడా ఉంది.. బెస్ట్ ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్లు కూడా ఈ కళాశాలలో జరుగుతున్నాయి. ఈ కళాశాలలో CSE బ్రాంచ్లో జనరల్ కేటగిరీలో రావాలి అంటే ర్యాంక్ 7000 లోపు వచ్చుండాలి.

వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ : (AP EAPCET)

ఈ కాలేజ్ కూడా గుంటూరులోనే ఉంది. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కూడా ప్రతి సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ కళాశాలలో మీకు CSE బ్రాంచ్ లో జనరల్ కేటగిరీలో సీటు రావాలి అంటే AP EAPCET లో ర్యాంక్ 7500 లోపు వచ్చి ఉండాలి.

🏹 Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *