ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి అర్హతతో 26 జిల్లాల్లో 1294 ఆశా కార్యకర్త ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం పదో తరగతి అర్హత ఉన్న మహిళల నుండి దరఖాస్తులు కోరుతూ కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది.
ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి అర్హత మీ జిల్లాలో మీ గ్రామం లేదా వార్డులో ఖాళీలు ఉంటే త్వరగా అప్లై చేయండి.
ఆశా కార్యకర్త ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు :
- పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి.
- సంబంధిత గ్రామ లేదా వార్డులో నివసిస్తున్న మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులు.
- తెలుగు భాష బాగా చదవడం , రాయడం వచ్చి ఉండాలి.
- వితంతువులు, విడాకులు పొందిన వారు, భర్త నుండి విడిపోయిన లేదా నిరాశ్రయురాలైన మహిళలకు ప్రాధాన్య తీస్తారు.
- ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన కలిగి ఉండి చక్కగా ఇతరులకు వివరించే తత్వం కలిగి ఉంది, నాయకత్వ లక్షణాలు, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పథం కలిగి ఉండాలి.
✅ స్కూల్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం 12,000/- రూపాయలు స్కాలర్షిప్ పథకం – Click here
జిల్లాల వారీగా ఆశా కార్యకర్త ఖాళీల సంఖ్య :
క్రింద పట్టికలో తెలిపిన విధంగా జిల్లాల వారీగా ఆశా కార్యకర్త ఉద్యోగాల ఖాళీల సంఖ్య ఉంది..

ఆశా కార్యకర్త ఉద్యోగాలకు జీతము :
ఆశా కార్యకర్త ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు పదివేల రూపాయలు జీతం ఇస్తారు.
ఆశా కార్యకర్త ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ :
- నివాస ధ్రువీకరణ పత్రం
- పదో తరగతి సర్టిఫికెట్
- రేషన్ కార్డు / ఆధార్ కార్డ్ / బిపిఎల్ కార్డు / ఓటర్ కార్డు
- వైవాహిక స్థితిని తెలియజేసే సొంత డెక్లరేషన్.
ఆశా కార్యకర్త ఉద్యోగాలు ఎంపిక విధానం :
- గ్రామాల్లో అయితే విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ అప్లై చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఒక్కో పోస్టుకు ముగ్గురిని చొప్పున ఎంపిక చేసి స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ కు లిస్టు పంపించాలి. మెడికల్ ఆఫీసర్ ఈ లిస్టును డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకు పంపిస్తారు.
- పట్టణాల్లో అయితే అర్బన్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ అప్లై చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఒక్కో పోస్టుకు ముగ్గురిని చొప్పున ఎంపిక చేసి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఉన్న మెడికల్ ఆఫీసర్ కు లిస్టు పంపించాలి. మెడికల్ ఆఫీసర్ ఈ లిస్టును డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి పంపిస్తారు.
- జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ చైర్మన్ గా ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో తుది ఎంపిక జరుగుతుంది.
ఆశా కార్యకర్త ఉద్యోగాలకు జిల్లాల వారీగా విడుదలైన నోటిఫికేషన్స్ :
ప్రభుత్వ నుండి వచ్చిన అనుమతులు మేరకు రాష్ట్రంలో ఆశా కార్యకర్త ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు తమ అప్లికేషన్ జిల్లా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా చివరి తేదీలోపు సంబంధిత గ్రామాల వార్డు సచివాలయం / PHC లేదా UPHC లో అప్లికేషన్ అందజేయాల్సి ఉంటుంది.
జిల్లాల వారీగా ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లు డౌన్లోడ్ చేసేందుకు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి మీ జిల్లా వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీ జిల్లా వెబ్సైట్ లో హోమ్ పేజీలో మీకు నోటిఫికేషన్ కనిపిస్తాయి. హోం పేజీలో నోటిఫికేషన్లు కనిపించకపోతే Notices లో Recruitment ప్లీజ్ ఓపెన్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఖాళీలు వివరాలు తెలుసుకోవచ్చు.
✅ Download District Wise Notifications – Click here