ఆరవ తరగతి నుండి పీజీ చదువుతున్న విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఆశా స్కాలర్షిప్ | State Bank Of India Foundation Asha Scholarship Apply | SBIF Asha Scholarship Details

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఇచ్చే ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాం – 2024 ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ ప్రకటన ద్వారా ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు చేయూతనివ్వడానికి ఆశా స్కాలర్షిప్ తీసుకొచ్చింది.

ఈ ఆశ స్కాలర్షిప్ కు ఎలా అప్లై చేయాలి ? అప్లై చేయడానికి ఎవరు అర్హులు ? ఎంపికైన వారికి ఎంత స్కాలర్షిప్ ఇస్తారు ? ఇలాంటి వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు మీరు చదివి తెలుసుకొని మీకు తెలిసిన పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వారి చేత అప్లై చేయించండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

 🔥 స్కాలర్షిప్ ప్రకటన విడుదల చేసిన సంస్థ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఈ ప్రకటన విడుదల చేసింది.

🔥 ఎవరు అర్హులు : 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు, డిగ్రీ, పీజీ, ఐఐటి, ఐఐఎం వంటి చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ ఆశా స్కాలర్ షిప్ కు అప్లై చేయవచ్చు.

  • అప్లై చేసే విద్యార్థులు గత విద్యా సంవత్సరం తరగతిలో కనీసం 75% మార్కులు పొంది ఉండాలి.
  • స్కూల్ విద్యార్థు కుటుంబ వార్షిక ఉదయం 3 లక్షల లోపు ఉండాలి.
  • అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయము ఆరు లక్షల లోపు ఉండాలి.

🔥 స్కాలర్షిప్ వివరాలు : విద్యార్థులకు వారి అర్హతల ఆధారంగా క్రింది విధంగా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది.

  • 6 నుండి 12వ తరగతి విద్యార్థులకు 15,000/-
  • అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 50,000/-
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 70,000/-
  • ఐఐటి విద్యార్థులకు 2,00000/-
  • ఐఐఎం విద్యార్థులకు 7,50,000/- 

🔥 అప్లై చేసే విధానం : అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. 

అప్లై చేసే సమయంలో క్రింది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి..

  • విద్యార్థుల గత విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్కులు షీట్ అప్లోడ్ చేయాలి.
  • ఆధార్ కార్డు 
  • ప్రస్తుత విద్యాసంవత్సరానికి చెందిన ఫీజు చెల్లించిన రసీదు. 
  • ఈ సంవత్సరంలో విద్యాసంస్థలో అడ్మిషన్ పొందినట్లుగా రసీదు. 
  • విద్యార్థులు లేదా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు 
  • విద్యార్థి యొక్క ఫోటో 
  • కుల ధ్రువీకరణ పత్రము 

🔥 ఎంపిక చేసే విధానం : 

  • అప్లై చేసుకున్న విద్యార్థుల అకాడమిక్ మెరిట్, విద్యార్థుల ఆర్థిక పరిస్థితి వంటి వాటి ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి చివరి తేదీ 01-10-2024

🔥 ఈ స్కాలర్షిప్ కు అప్లై చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *