ఆపరేషన్ సింధూర్ పై భారత్ భరత ప్రధాని కీలక ప్రకటన చేశారు.. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ కాల్పులు జరిపితే భారత్ కూడా ప్రతిస్పందిస్తుంది అని తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ గారు త్రివిధ దళాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
భారత్ విధానం ఇదే :
పాకిస్తాన్ విషయంలో భారత్ విధానం ఏమిటో ప్రధాని స్పష్టం తెలియజేశారు. పాకిస్తాన్ POK మరియు టెర్రరిస్టులను భారత్ కు అప్పగించాలి.. ఇదే తమ విధానం అని, ఈ విషయంలో పాకిస్తాన్ తో మాట్లాడానికి ఏమీ లేదని ఆయన తెలియజేశారు… ఈ విషయంలో ఇతర దేశాల మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
పాకిస్తాన్ ఓడిపోయింది : ప్రధాని వెల్లడి
భారత ఆర్మీ చేసిన దాడులతో పాకిస్తాన్ ధ్వంసం అయిందని ప్రధాని మోదీ ప్రకటించారు.. త్రివిధ దళాల అధిపతులతో జరిగిన భేటీలో మన దేశం చేసిన యుద్ధంలో ప్రతి రౌండ్ లోను పాకిస్తాన్ ఓడిపోయిందని , పాకిస్తాన్ ఎయిర్ బేస్ లపై మన దేశం జరిపిన దాడులతో వాళ్లు అసలు యుద్ధంలోనే లేరనే విషయం స్పష్టమైందని తెలిపారు.