Headlines

UIDAI కొత్త మార్గదర్శకాలు జారీ | ఆధార్ కార్డులో మార్పులకు ఈ డాక్యుమెంట్ తప్పనిసరి..

ఆధార్ కార్డు లో మార్పులు

యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు లకు సంబంధించి ముఖ్య ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఆధార్ కార్డులను పొందాలి అనుకున్నా , ఉన్న ఆధార్ కార్డులో మార్పులు చేయాలి అన్నా అనగా చిరునామా, ఫోటో, పేరు వంటివి మార్చాలి అంటే కొన్ని కొత్త నిబంధనలు జారీచేసింది.

2025 – 26 సంవత్సరానికి సంబంధించి మార్పులు మరియు కొత్త ఆధార్ పొందేందుకు అవసరమగు డాక్యుమెంట్ల వివరాలను UIDAI వారు అధికారికంగా విడుదల చేశారు.

ఈ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు ను ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోగలరు.

Join Our Telegram Group – Click here

🔥 ఆధార్ – కొత్త మార్గదర్శకాలు :

  • UIDAI వారి యొక్క కొత్త మార్గదర్శకాలు ప్రకారం , ఇటీవల ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న వారికి కొత్త ఆధార్ కార్డు లో పూర్తి డేట్ ఆఫ్ బర్త్ కనిపించదు.
  • జన్మించిన సంవత్సరం లేదా వయస్సు మాత్రమే కనిపిస్తుంది.
  • అయితే పూర్తి డేట్ ఆఫ్ బర్త్ వివరాలు UIDAI డేటా బేస్ లో ఉంటాయి.అధికారిక విభాగాల ఆ డేట్ ఆఫ్ బర్త్ ను వినియోగించుకోవచ్చు.
  • ప్రైవసీ పాలసీ లో భాగంగా ఈ నిబంధన ను అమలు చేస్తున్నారు.

🔥 ఒక వ్యక్తి కి ఒకే ఆధార్ :

  • UIDAI వారి నియమ నిబంధనల మేరకు ఒక పౌరుడు ఒక్క ఆధార్ మాత్రమే కలిగి వుండాలి.
  • పొరపాటున లేదా మరీ ఇతర కారణాల వలన ఒకటి కంటే ఎక్కువ ఆధార్ లు ఉంటే మొట్ట మొదటి సారిగా జారీ చేసిన ఆధార్ మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది అని UIDAI వారు ప్రకటించారు. మిగతా అన్ని ఆధార్ లు ఇనాక్టివ్ అవుతాయి అని తెలిపారు.

🔥 ఆధార్ కొరకు ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి :

  • ఆధార్ కి సంబంధించి సర్వీస్ పొందేందుకుగాను UIDAI వారు నాలుగు రకాల డాక్యుమెంట్లను తప్పనిసరి చేశారు. అవ
  • 1. ఐడెంటిటీ ప్రూఫ్ : పాస్ పోర్ట్, ఈ పాన్ కార్డ్ , డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, MGNREGS జాబ్ కార్డ్, ట్రాన్స్ జెండర్ ఐడి కార్డ్ , పెన్షన్సర్ గుర్తింపు కార్డ్ , హెల్త్ కార్డ్ , ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కార్డ్ లేదా ప్రభుత్వం గుర్తించిన ఫోటో కలిగిన ఏదైనా ఇతర గుర్తింపు కార్డ్ ను ఐడెంటిటీ ప్రూఫ్ గా అంగీకరిస్తారు.
  • కొత్త ఆధార్ పొందేందుకు ఇందులో ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉంటుంది.
  • 2. అడ్రస్ ప్రూఫ్ : బ్యాంకు పాస్ బుక్ లేదా బ్యాంకు స్టేట్మెంట్ , రేషన్ కార్డు, పాస్ పోర్ట్ , డ్రైవింగ్ లైసెన్స్ , పెన్షన్ డాక్యుమెంట్ , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం వంటివి అడ్రస్ ప్రూఫ్ గా వినియోగించవచ్చు.
  • 3.బర్త్ సర్టిఫికెట్ : ఆధార్ లో డేట్ ఆఫ్ బర్త్ మార్చేందుకు బర్త్ సర్టిఫికెట్ గా స్కూల్ మార్క్స్ షీట్ , పాస్ పోర్ట్ , డేట్ ఆఫ్ బర్త్ కలిగిన పెన్షన్ డాక్యుమెంట్ , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ కలిగిన ఇతర సర్టిఫికెట్లు ఉపయోగించవచ్చు.
  • 4.C/0 గా తండ్రి , భర్త పేరు కొరకు: అధికారులు ఇచ్చే ధృవీకరణ సర్టిఫికెట్ వంటివి అవసరం.

🔥నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి :

ఈ కొత్త నిబంధనలు భారత పౌరులకు , NRI లకు, 5 సంవత్సరాలు వయస్సు దాటిన పిల్లల ఆధార్ అప్డేట్ కొరకు , దీర్ఘ కాలిక వీసా పై భారత దేశంలో నివసిస్తున్న విదేశీయులు మొదలగు వారికి ఈ షరతులు వర్తిస్తాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!