ఆంధ్రప్రదేశ్ లో సొంత జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP ECHS Clerk, Data Entry Operator Jobs Recruitment 2024 | Latest jobs 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ విశాఖపట్నంలో ఉన్న భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ (ECHS Cell) నుండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ECHS పాలి క్లినిక్స్ లో ఖాళీలు భర్తీ కోసం విడుదల చేయడం జరిగింది..

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా విశాఖపట్నం, శ్రీకాకుళం మరియు కాకినాడ లలో ఉన్న ECHS పాలి క్లినిక్స్ లో క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో ఒక సంవత్సరం కాల పరిమితికి భర్తీ చేస్తున్నారు. సంస్థ అవసరం మరియు అభ్యర్థి పనితీరు ఆధారంగా కాంట్రాక్టు కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ECHS) నుండి విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా ECHS పాలీ క్లినిక్స్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  1. మొత్తం ఖాళీల సంఖ్య – 04 .. (క్లర్క్ పోస్టులు – 01, డేటా ఎంట్రీ ఆపరేటర్ – 03)
  2. ఇందులో విశాఖపట్నం లొకేషన్ లో ఒక క్లర్క్ పోస్టు ఉంది. 
  3. విశాఖపట్నం, శ్రీకాకుళం మరియు కాకినాడ ప్రాంతాల్లో ఉన్న ECHS పాలి క్లినిక్స్ లో ఒక్కొక్క పోస్టు చొప్పున ఉంది.

🔥 విద్యార్హతలు : 

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు క్లర్క్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత లేదా ఆర్మ్డ్ ఫోర్సెస్ నుండి క్లాస్-1 క్లరికల్ ట్రేడ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి .
  • మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.

🔥 అప్లికేషన్ విధానం :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అన్ని వివరాలు సరిగ్గా నింపి , అవసరమైన అన్ని సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు పైన సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం :

  • అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ మరియు ఇంటర్వ్యూ ప్రదేశం యొక్క సమాచారం సమాచారం ఫోన్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా లేదా మెయిల్ ద్వారా తెలియజేస్తారు. 
  • ఇంటర్వ్యూకు హాజరయ్య అభ్యర్థులు పదవ తరగతి, 12వ తరగతి, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లమో వంటి విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్, మార్క్ షీట్స్ , అనుభవ ధ్రువీకరణ పత్రం, మరి ఇతర సర్టిఫికెట్స్ తో స్వయంగా హాజరు కావాలి. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥 జీతము :

  • ఎంపికైన వారికి నెలకు 22,500/-

🔥 పోస్టింగ్ ప్రదేశం : 

  • ఎంపికైన వారికి విశాఖపట్నం శ్రీకాకుళం కాకినాడ లొకేషన్స్ లో ఉన్న ECHS పాలి క్లినిక్స్ లో పోస్టింగ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 17-12-2024 తేదీలోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ అందజేయాలి 

🔥 అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా : 

  • OIC, Stn HQs (ECHS Cell) , Nausena Baugh, PO – Gandhigram , Visakhapatnam, Andhra Pradesh, PIN – 530005 

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Full Notification – Click here 

👉 Download Application – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *