ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డివిజన్ లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | AP Revenue Department Recruitment 2025 | AP Latest jobs Notifications

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డివిజన్లలో వివిధ కారణాలు వలన ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లు పోస్టులు మరియు కొత్తగా ఏర్పడిన చౌక దుకాణాల్లో రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి.

తాజాగా విడుదల చేసిన 107 రేషన్ డీలర్ల పోస్టులు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

🏹 AP లో 142 కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • తాజాగా శ్రీకాకుళం జిల్లాలో 107 రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
  • ఆమదాలవలస , బూర్జ, ఎచ్చెర్ల, జి.సిగడం, జలుమూరు, లావేరు, నరసన్నపేట, పోలాకి, పొందూరు, రణస్థలం, సరుబుజ్జిలి, శ్రీకాకుళం మండలాలలో వివిధ గ్రామాల్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. (ఏఏ గ్రామాల్లో ఖాళీలు ఉన్నాయో తెలుసుకునేందుకు క్రింది ఉన్న లింకుపై క్లిక్ చేయండి)

👉 Download Notification & Application

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • రేషన్ డీలర్లు పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.

🔥 ఖాళీల సంఖ్య

  • మొత్తం 107 రేషన్ డీలర్స్ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది.

🔥 విద్యార్హత :

  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు.
  • పోస్టులు ఖాళీగా ఉన్న ప్రదేశంలో అభ్యర్థులు నివసిస్తూ ఉండాలి.
  • అభ్యర్థులపై సివిల్ లేదా క్రిమినల్ కేసులు నమోదై ఉండకూడదు. 
  • స్థానికంగా నివసించే ప్రజాప్రతినిధులు ఈ పోస్టులకు అర్హులు కాదు.

🔥  వయస్సు :

  • 18 నుండి 40 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥దరఖాస్తు విధానం :

  • దరఖాస్తు ఫారం ను సంబంధిత సచివాలయం నుండి లేదా సంబంధిత తహసిల్దార్ కార్యాలయం నుండి లేదా రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం నుండి ఉచితంగా పొందవచ్చు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

  • శ్రీయుత రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం ఆవరణ, శ్రీకాకుళం జిల్లా – 532001

🔥 అప్లికేషన్ ఫీజు :

  • రెవిన్యూ డివిజనల్ అధికారి , శ్రీకాకుళం అనే పేరు మీద,  DD రూపంలో ఫీజు 600/- చెల్లించాలి. 

🔥 అవసరమగు ధృవ పత్రాలు :

  • క్రింది సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు పైన గెజిటెడ్ అధికారులు చేత అటేస్టేషన్ చేయించి అప్లికేషన్ కి జతపరిచి అప్లై చేయాలి.
  • దరఖాస్తు అందజేసే కవరు పైన రేషన్ డిపో డీలర్ నియామకం కోసం అని వ్రాస్తూ రేషన్ డిపో నెంబర్____ డీలర్ నియామకమునకు దరఖాస్తు చేయబడుతుంది అని తెలుపవలెను.
  • 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు
  • నివాస ధ్రువీకరణ పత్రం (ఓటర్ కార్డు / ఆధార్ కార్డు / పాన్ కార్డు వంటివి )
  • కుల దృవీకరణ పత్రం
  • మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
  • దివ్యాంగులు అయితే సంబంధిత ధృవ పత్రాలు. (సదరం సర్టిఫికెట్)
  • ఫీజు చెల్లించిన డిడి

🔥 ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయిస్తారు. 

 🔥 ముఖ్యమైన తేదిలు

  • నోటిఫికేషన్ విడుదల తేది : 02-01-2025
  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 02-12-2024
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 23/01/2025
  • హాల్ టికెట్స్ విడుదల తేది : 31/01/2025 
  • వ్రాత పరీక్ష నిర్వహణ తేది : 05/02/2025
  • ఇంటర్వ్యూలు నిర్వహణ తేది : 09/02/2025
  • రాత పరీక్ష నిర్వహించే ప్రదేశం : ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) , శ్రీకాకుళం
  • ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం : రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం, శ్రీకాకుళం

👉 Download Notification & Application 

📌 Join Our What’s App Channel 
📌 Join Our Telegram Channel

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *