ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళా సాధికారత లక్ష్యంగా డిజిటల్ లక్ష్మి పథకం తీసుకొస్తుంది. డ్వాక్రా సంఘంలోని మహిళలను డిజిటల్ లక్ష్మిలు గా నియమించబోతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అనేక పథకాలను తీసుకొస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకాలకు అప్లై చేసుకునే సమయంలో ఇతరుల ప్రమేయం లేకుండా డ్వాక్రా సంఘాలలో డిగ్రీ చదివి , కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారిని డిజిటల్ లక్ష్మి గా నియమించి వారితో ప్రజలు ప్రభుత్వ పథకాలు అప్లై చేసుకునే విధంగా పనిచేయిస్తారు.
డిజిటల్ లక్ష్మి పథకానికి అర్హతలు ఏమిటి ?
- డ్వాక్రా గ్రూపులలో డిగ్రీ లేదా ఆ పైన చదివిన మహిళలు డిజిటల్ లక్ష్మీ పథకానికి అర్హులు.
డిజిటల్ లక్ష్మిగా ఎంపికైన వారు చేయాల్సిన పని ఏమిటి ? :
- రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త పథకంలో ఎంపికైన మహిళలు స్థానికంగా ఉండే ప్రజలు మరియు డ్వాక్రా మహిళలకు సంక్షేమ పథకాలు కోసం తెలియజేసి అప్లై చేయడంతో పాటు, కొన్ని రకాల డిజిటల్ సేవ్వాలని అందించాల్సి ఉంటుంది. దీనికోసం డిజిటల్ లక్ష్మిగా ఎంపికైన వారు తాము నివసిస్తున్న ఇంటివద్ద ఒక రూమ్ ఏర్పాటు చేసుకుని మీసేవ తరహాలో సేవలు అందించవచ్చు.
వివిధ ప్రభుత్వ పథకాలు సమాచారం మీ మొబైల్ లో వాట్సాప్ కు రావాలి అంటే క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి..
డిజిటల్ లక్ష్మి గా ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వ సహాయం :
- డిజిటల్ లక్ష్మిగా ఎంపికైన వారికి బ్యాంకు ద్వారా రెండు లక్షల రుణ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ డబ్బుతో ఇంటి వద్ద మీసేవ తరహాలో ఏర్పాటు చేసుకోవచ్చు..
రాష్ట్రంలో నెల రోజులు పాటు ఇంటింటి సర్వే – అడుగుతున్న ప్రశ్నలు ఇవే – Click here