ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో అటవీ శాఖ లో ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఇప్పటికే మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ లో ఉద్యోగాలు భర్తీ కొరకు అభ్యర్థులు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉండడం తో ఈ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ , అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ , ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ఖాళీలు ఉన్న విషయం విదితమే. దాదాపుగా 691 ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కి సంబంధించి వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ డిగ్రీ అర్హతతో 14,582 ఉద్యోగాలు – Click here
🔥 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసే సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సంస్థ ఈ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
🔥 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ లో మొత్తం ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారు ? :
- ప్రాథమిక సమాచారం ప్రకారం అటవీ శాఖలో 691 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నిర్ణయించారని తెలుస్తోంది.
🔥 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఉద్యోగాలకు అర్హతలు :
- అటవీ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
- అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్నవారు అప్లై చేయవచ్చు.
- ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు.
🔥 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఉద్యోగాలకు వయో పరిమితి :
ఈ ఉద్యోగాలకు సంబంధించి 18 – 42 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల యొక్క కేటగిరి ఆధారంగా వయో సడలింపు లభిస్తుంది.
🔥 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు విధానం :
ఈ ఉద్యోగాలకు సంబంధించి APPSC వారి అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు..
🔥 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఉద్యోగాలకు ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు OMR ఆధారిత ఆఫ్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఉద్యోగాలు భర్తీ తాజా ముఖ్యమైన అంశాలు :
అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ చేయనున్నామని , ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ , అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు మరికొద్ది రోజులలో విడుదల చేస్తామని , ఈ నోటిఫికేషన్స్ కు సంబంధించి కొత్త సిలబస్ ను అధికారిక వెబ్సైట్లో ఇప్పటికే పెట్టడం ఏపీపీఎస్సీ సెక్రెటరీ రాజబాబు గారు తెలియజేయడం జరిగింది.