Headlines

అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ మీ మొబైల్ లో చూసుకోండి ఇలా | డబ్బులు జమ ఎందుకు ఆలస్యం అయ్యిందో మీకు తెలుసా ?

అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ లింక్

రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు, రైతులు సంక్షేమానికి దోహదం చేసేందుకు ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తున్నాయి. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకునే విధానం ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి చివరి వరకు చదవండి అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకోండి.

Join Our What’sApp Group – Click here

పిఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకాలు ద్వారా జరిగే లబ్ధి :

పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000/- రూపాయలను అర్హత ఉన్న రైతుల అకౌంట్ లో జమ చేస్తుంది.

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 14,000/- రూపాయలను అర్హత ఉన్న రైతుల అకౌంట్ లో జమ చేస్తుంది.

అయితే ఈ నిధులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి విడతలో 2,000/- రూపాయలు చొప్పున 3 విడతల్లో మొత్తం నిధులను జమ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి రెండు విడతల్లో 5,000/- రూపాయలు చొప్పున మూడో విడతలో 4,000/- రూపాయలను జమ చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు విడుదల చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న వారి జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో పేరు ఉంటేనే మీకు పథకం డబ్బులు జమవుతాయి.

ప్రభుత్వం ఖరారు చేసిన లిస్టులో పేరు లేని రైతులు జూలై 13వ తేదీలోపు తమకు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో సంప్రదించి గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. రైతుకు అన్ని అర్హతలు ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల డబ్బులు జమవుతాయి.

అన్నదాత సుఖీభవ పథకం లిస్టులో పేరు ఉందో లేదో ఎలా చెక్ చేయాలి ?

  • అన్నదాత సుఖీభవ పథకం లిస్ట్ లో పేరు ఉందో లేదో మూడు విధాలుగా తెలుసుకోవచ్చు.

రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ పథకం అర్హులు జాబితా :

  • మీరు మీకు దగ్గరలో ఉన్న రైతు సేవ కేంద్రంలో సంప్రదించి అర్హులు జాబితాలో తమ పేరు ఉందో లేదో అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకోవచ్చు.

వాట్సాప్ ద్వారా అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకునే విధానం :

  • వాట్సాప్ ద్వారా అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకోవాలి అంటే ముందుగా మీరు మీ మొబైల్ లో వాట్సాప్ ఓపెన్ చేసి మన మిత్ర వాట్సాప్ సర్వీస్ 95523 00009 అని నంబర్ కు “Hi” అని మెసేజ్ పంపించాలి.
  • వచ్చిన మెనూలో సేవను ఎంచుకోండి పైన క్లిక్ చేయాలి.
  • అన్నదాత సుఖీభవ పథకం పైన క్లిక్ చేయాలి
  • తరువాత స్థితిని తనిఖీ చేయండి అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
  • నిర్ధారించండి అనే ఆప్షన్ పైన ఇప్పుడు క్లిక్ చేస్తే రైతు పేరు, తండ్రి పేరు, జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, అర్హత స్థితి , ఈ కేవైసీ పూర్తయిందా లేదా అనే వివరాలు కనిపిస్తాయి.
  • మీరు అనర్హులైతే దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో వెంటనే సంప్రదించండి.

అధికారిక వెబ్సైట్ లో అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకునే విధానం :

  • అన్నదాత సుఖీభవ పథకం అధికారిక వెబ్సైట్ నుండి కూడా మీరు స్టేటస్ తెలుసుకోవచ్చు.
  • దీని కోసం https://annadathasukhibhava.ap.gov.in/know-your-status లింకు పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ మరియు అక్కడ కనిపించిన CAPTCHA ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ పేరు, తండ్రి పేరు, గ్రామము, మండలం, జిల్లా పేర్లు మరియు మీరు అర్హులా కాదా అనే వివరాలు కనిపిస్తాయి.
  • ఈ విధంగా స్టేటస్ తెలుసుకున్న తర్వాత మీకు అర్హత లేకపోతే మీకు దగ్గరలో ఉన్న రైతు సేవ కేంద్రంలో వెంటనే సంప్రదించండి.

పీఎం కిషన్ అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఎప్పుడు జమ చేస్తారు ?

కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా 20వ విడత నిధులు జూలై 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు జమ అయ్యే సమయంలో రైతుల అకౌంట్ లో జమ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా కింద నిధులను విడుదల చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!