ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కోసం ఎదురు చూస్తున్న రైతులకు ముఖ్యమైన సమాచారం. అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ కూడా అధికారిక వెబ్సైట్ లో పెట్టారు. రోజుల్లో అర్హత ఉన్న రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు అర్హత ఉన్న రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నుండి PM కిసాన్ సమ్మాన్ పథకంలో భాగంగా ఈ నెలలో రైతుల అకౌంట్లో 2,000/- రూపాయలు జమ కాగానే రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా 5,000/- రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది.
🏹 వివిధ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ వాట్సాప్ కి రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.
అన్నదాత సుఖీభవ పథకం తుది జాబితా విడుదల :
అయితే తాజాగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులు జాబితాను సిద్ధం చేయడం జరిగింది. ఈ జాబితాలో అర్హత ఉన్నవారు పేరు లేకపోతే రైతు ఈనెల పదో తేదీలోపు రైతు సేవా కేంద్రాల్లో అర్జీ పెట్టుకోవచ్చు. అర్జీ పెట్టుకున్న రైతుకు అర్హత ఉంటే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా నగదు జమ చేస్తారు.
🏹 అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో తెలిజేసిన ముఖ్యమంత్రి గారు – Click here
అన్నదాత సుఖీభవ జాబితాలో పేరు ఉందో లేదో ఇలా చెక్ చేయండి :
పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది సులభంగానే తెలుసుకోవచ్చు. దీనికోసం క్రింద ఇవ్వబడిన లింకు పై క్లిక్ చేసి రైతు యొక్క ఆధార్ నెంబర్ మరియు అక్కడ ఇచ్చిన Captch ఎంటర్ చేయండి. తుది జాబితాలో పేరు ఉంటే రైతు వివరాలన్నీ కనిపిస్తాయి.
🏹 Annadhata Sukhibava Status – Click here
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎప్పుడు జమ్ చేస్తారు ?
పిఎం కిసాన్ సమ్మాన్ పథకంలో భాగంగా అర్హత ఉన్న రైతుల అకౌంట్లో ఈనెల 18వ తేదీ నాటికి 20వ విడత డబ్బులు జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రోజున జమ చేసే అవకాశం ఉంది.
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎంత జమ చేస్తారు ? :
పీఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుండి 2,000/- జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా 50,000/- జమ చేస్తారు. కాబట్టి మొత్తం 7,0000/- జమ కానున్నాయి.
అన్నదాత సుఖీభవ పథకం అర్జీ పెట్టుకోవడం ఎలా ? :
పైన తెలిపిన విధంగా అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకున్నవారు , Details not found అని తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రంలో లేదా గ్రామ సచివాలయం లో జూలై 10వ తేదీ లోపు సంప్రదించి అర్జీ పెట్టాలి. మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు మీ అకౌంట్లో జమ చేస్తారు.