అంధ్రప్రదేశ్ లో 6100 పోలిస్ కానిస్టేబుల్ ఉద్యోగాల సమాచారం | AP Police Constable PMT , PET Dates Announced | APSLPRB Police Constable Events Dates

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంద్రప్రదేశ్ లోని పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మంచి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం కి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT) మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) నిర్వహణ కొరకు తేదీలను ప్రకటించింది.

ఈ సమాచారము ను పూర్తిగా తెలుసుకోవడం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 6100

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : పోలీస్ కానిస్టేబుల్

🔥 విద్యార్హత : ఇంటర్మీడియెట్ 

🔥  వయస్సు :

  • 18 సంవత్సరాలు నిండి 24 సంవత్సరాల లోపు వుండాలి.

🔥 ముఖ్యమైన అంశాలు

  • ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 28/11/2022 న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 
  • 2023 జనవరి 22 వ తేదిన ప్రిలిమినరీ పరిక్ష నిర్వహించి , తర్వాత కాలం లో ఫలితాలను విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష లో 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
  • ఆ తర్వాత కాలంలో నిర్వహించవలసిన ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ( PMT) మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ( PET) కోర్టు కేసులు , వివిధ అడ్మినిస్ట్రేటివ్ కారణాల వలన నిర్వహించలేకపోయారు. 
  • ఇటీవల ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు స్టేజ్ -2 కొరకు దరఖాస్తు  చేసుకునేందుకు గాను  మరొకసారి అవకాశం కూడా ఇచ్చారు.
  • ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎదురు చూస్తున్న ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ( PMT) మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ( PET) నిర్వహణ కొరకు తేదీలను బోర్డు డిసెంబర్ 12 / 2024 నాడు ప్రెస్ నోట్ విడుదల చేసి ప్రకటించింది. 
  • ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ( PMT) మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ( PET ) లను 30/12/2024 నుండి 01/02/2025 వరకు  ఉమ్మడి 13 జిల్లాల ప్రాధిపతికన నిర్వహిస్తున్నారు.
  • ఈ స్టేజ్ – 2 ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ( PMT) మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ( PET ) కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కాల్ లెటర్లను  18/12/2024 మధ్యాహ్నం 3:00 గంటల నుండి 29/12/2024 మధ్యాహ్నం 3:00 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అభ్యర్థులకు ఏమైనా సందేహాలు వుంటే ఫోన్ నెంబర్ : 9441450369 మరియు ఫోన్ నెంబర్ : 9100203323 లకు సంప్రదించవచ్చు.

👉 Click here to download official press release 

👉 Official Website – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *