ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
అర్హత కలిగిన హిందూ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించిన ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అనగా , ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి జీతం ఎంత లభిస్తుంది? ఎంత వయస్సు లోపు గల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు? అవసరమగు విద్యార్హత ఏమిటి ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
- తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి వారి నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥భర్తీ చేయబోయే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు.
🏹 ఇంటి నుండి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా నెలకు 40,000/- సంపాదించే అవకాశం – Click here
🔥 భర్తీ చేయబోయే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల సంఖ్య :
- సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ – 01
- ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ – 03
🔥 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు విద్యార్హతలు :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫుడ్ టెక్నాలజి / డైరీ టెక్నాలజీ/ బయో టెక్నాలజీ/ ఆయిల్ టెక్నాలజీ/ అగ్రికల్చర్ సైన్స్ / వెటర్నరీ సైన్స్ / బయో కెమిస్ట్రీ / మైక్రో బయాలజీ లలో బ్యాచిలర్ డిగ్రీ లేదా కెమిస్ట్రీ లో మాస్టర్స్ లేదా మెడిసిన్ లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
(లేదా)
- కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి తత్సమాన అర్హత కలిగి ఉండి , గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫుడ్ అథారిటీ వారు ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి.
- సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధిత ఫీల్డ్ లో 3 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు అనుభవం అవసరం లేదు.
🔥 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలను వయోపరిమితి :
- 42 సంవత్సరాల లోపు వయస్సు గల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనల మేరకు వయోసడలింపు లభిస్తుంది.
🔥ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు విధానం :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారం ను ఫిల్ చేసి , సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి నోటిఫికేషన్ లో ప్రస్తావించిన చిరునామాకు కి అందచేయాలి.
- దరఖాస్తు పైన ఈ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో అన్న అంశాన్ని ప్రస్తావించాలి. ( Application for the post of “__________”).
- 10/07/2025 లోగా దరఖాస్తు సమర్పించాలి.
🔥దరఖాస్తు అందచేయవలసిన చిరునామా :
The Assistant Executive officer (COC),
Centralized Outsourcing Cell,
T.T.D Administrative buildings , KT Road,
Tirupati, AP.
🔥ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అవసరమగు ధ్రువపత్రాలు :
- విద్యార్హత సర్టిఫికెట్లు
- విద్యార్హత సంబంధిత మార్క్స్ మెమోలు
- కుల ధ్రువీకరణ పత్రం / దివ్యాంగుల సర్టిఫికెట్
- ఎక్స్పీరియన్స్ ఉన్నచో సంబంధిత సర్టిఫికెట్
- ఆధార్ కార్డు
- ఇతర సర్టిఫికెట్ లు ఏమైనా
🔥 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు జీతము :
- ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా ఎంపిక అయితే నెలకు 44,570/- రూపాయలు & సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా ఎంపిక అయితే 61,960/- రూపాయలు నెల జీతంగా లభిస్తుంది.
🔥ముఖ్యమైన తేదీ :
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 10.07.2025
👉 Click here for notification and Application