ప్రతి నెలా 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి పథకం అమలుపై ముఖ్యమంత్రి ప్రకటన | AP Nirudyoga Bruthi Scheme Latest News

నిరుద్యోగ భృతి పథకం అర్హతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి పథకం అమలు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నిరుద్యోగ భృతి పథకం ద్వారా అర్హత కలిగిన నిరుద్యోగులకు నెలకు 3,000/- రూపాయలు చొప్పున అందించేందుకు మార్గదర్శకాలు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కీలక ప్రకటన చేశారు.

నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.

🏹 Join Our What’s App Group – Click here

🔥 అతి త్వరలో నిరుద్యోగ భృతి పథకం అమలు :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అయిన నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తెలిపారు.
  • అతి ముఖ్యమైన పథకంగా భావిస్తున్న ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు గాను మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
  • నిరుద్యోగ భృతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతలను అనుసరించి ఎంపిక చేస్తామని అన్నారు.
  • నెలకు 3,000/- రూపాయలు నిరుద్యోగి చెల్లించే విధంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

🏹 అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకోండి – Click here

🔥 రాష్ట్రం లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం :

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి గారు పునరుద్ఘాటించారు.
  • ఇప్పటికే సుమారుగా 5 లక్షల ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు.
  • ఉద్యోగ అవకాశం లభించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండనుంది.
  • 2029 నాటికి రాష్ట్రంలో పేదవారు లేకుండా చూస్తామని తెలిపారు.
  • నిరుద్యోగ భృతి అమలు చేస్తామని , మెగా డీఎస్సీ ద్వారా 16,500 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసి మరో నెలలో వారికి పోస్టింగ్ ఇప్పిస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!