మీ ఇంటి దగ్గరే పని చేస్తూ పోస్టల్ ఫ్రాంచైజీ ద్వారా నెలకు 40,000/- సంపాదించండి | Postal Franchise Scheme in Telugu

పోస్టల్ ఫ్రాంచైజీ స్కీమ్

మీరు పదో తరగతి పూర్తి చేశారా ? మీ వయస్సు 18 సంవత్సరాలు పూర్తయిందా ? మీకు ఎలాంటి ఉద్యోగం లేకపోతే, ఏదైనా బిజినెస్ చేయాలి అనే కోరిక ఉందా ? ఎలాంటి బిజినెస్ చేయాలో మీకు అర్థం కావడం లేదా ?

మీరు ఏదైనా బిజినెస్ చేయాలి అంటే పెట్టుబడి తో పాటు ఆ బిజినెస్ పై ఉండాలి. అంతేకాకుండా ఆ బిజినెస్ రిస్క్ తక్కువై ఉండాలి. ఆ బిజినెస్ సక్సెస్ అయితే పర్వాలేదు లేకపోతే మీరు నష్టపోతారు. లాభం రాదు కదా పెట్టుబడి కూడా పోతుంది. మీ సమయం వృధా అవుతుంది. ఇలాంటి సమస్యలు లేకుండా మీకు అద్భుతమైన అవకాశం ఈ ఆర్టికల్ ద్వారా మీకు మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఇస్తున్న ఈ పోస్టల్ ఫ్రాంచైజీ స్కీమ్ ఉపయోగించుకోండి. ఈ పోస్టల్ ఫ్రాంచైజీ పెట్టడానికి తక్కువ పెట్టుబడి ఉంటే చాలు. రిస్క్ కూడా లేదు.

పోస్టల్ ఫ్రాంచైజీ అంటే ఏమిటి ?

పోస్టల్ డిపార్ట్మెంట్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి అనే ఉద్దేశంతో పోస్టల్ ఫ్రాంచైజీ స్కీమ్ ప్రభుత్వం తీసుకొచ్చింది.

పోస్టల్ ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే ఉండవలసిన అర్హతలు :

  • మీరు కనీసం 8వ తరగతి లేదా పదో తరగతి పూర్తి చేసి ఉండాలి
  • మీ వయస్సు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి
  • పోస్టల్ ఫ్రాంచైజీ ఓపెన్ చేయడానికి మీకు కనీసం 100 చదరపు గజాల స్థలం ఉండాలి.
  • మీరు 5,000/- నుండి 10,000/- వరకు సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేయాలి.
  • బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ లేదా మొబైల్ నాలెడ్జ్ తప్పనిసరి.

పోస్టల్ ఫ్రాంచైజీ ద్వారా మీకు వచ్చే ఆదాయం వివరాలు :

  • పోస్టల్ ఫ్రాంచైజీ తీసుకోవడం వలన మీకు ప్రతినెల జీతం అంటూ ఏమీ రాదు.
  • మీరు అందించే సేవలు బట్టి మీకు కమిషన్ వస్తుంది.
  • స్పీడ్ పోస్ట్లకు ఏడు శాతం నుంచి 25% వరకు కమిషన్ ఇస్తారు.
  • మనీ ఆర్డర్లకు మూడు రూపాయిల నుండి 5 రూపాయల వరకు కమిషన్ ఇస్తారు.
  • స్టాంపులకు ఐదు శాతం వరకు కమిషన్ ఇస్తారు.
  • ఈ విధంగా మీరు ఏర్పాటు చేసిన ప్రాంతంలో పోస్టల్ ఫ్రాంచైజీ ద్వారా ప్రజలకు మీ నుండి జరిగే సేవలు ఆధారంగా మీరు నెలకు 40 వేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

పోస్టల్ ఫ్రాంచైజీ ద్వారా ఎలాంటి సేవలు మీరు అందిస్తారు ?

  • పోస్టల్ ఫ్రాంచైజీ స్కీం ద్వారా స్పీడ్ పోస్ట్ మరియు రిజిస్టర్డ్ పోస్ట్, స్టాంపులు, మనీ ఆర్డర్లు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కలెక్షన్ మరియు మరికొన్ని ఇతర సర్వీసులు మీరు అందించవచ్చు.

పోస్టల్ ఫ్రాంచైజీ కు దరఖాస్తు చేసుకునే విధానం ఇదే :

  • పోస్టల్ ఫ్రాంచైజీ కోసం మీరు ముందుగా పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి.
  • మీ జిల్లాలో ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్ కేంద్ర కార్యాలయంలో నింపిన దరఖాస్తు అవసరమైన సర్టిఫికెట్లు జతపరిచి అందజేయాలి.
  • మీరు అప్లికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులకు అందజేసిన తర్వాత మీ అప్లికేషన్ వెరిఫికేషన్ చేసి, మీ స్థలం వెరిఫికేషన్ చేస్తారు. తరువాత మీకు అన్ని అర్హతలు ఉంటే పోస్టల్ ఫ్రాంచైజీ ఇస్తారు.
  • మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

🏹 Official Website – Click here

🏹 Download Notification & Application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!