AP CRP Jobs Notification 2025 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పరిశుభ్రత కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా గ్రామాలలో మరియు రాష్ట్రాలలో చెత్త సేకరణ చేస్తుంది. పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరియు రాష్ట్రంలో అందరినీ భాగస్వామ్యం చేసేందుకు గాను స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గల అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో, పాఠశాలలలో, కాలేజీ లలో
, ఆసుపత్రులలో మొదలగు కార్యాలయాలలో ప్రతి నెలా మూడవ శనివారం పారిశుద్ధ్యం – పరిశుభ్రత కొరకు అవగాహన కల్పిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో గల పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ఘన వ్యర్థాల నిర్వహణ కొరకు ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు గాను క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (CRP) ను నియామకం చేయనుంది.
క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ( CRP ) లను నియమించి , వారికి శిక్షణ ఇచ్చి గౌరవ వేతనం అందించనున్నారు. ఈ CRP లను ఏ విధంగా నియామకం చేస్తారు ? ఎంపిక ఏ విధంగా ఉంటుంది ? గౌరవ వేతన ఎంత ఇస్తారు వంటి ఇతర అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 CRP లను ఎవరు రిక్రూట్ చేస్తున్నారు ? :
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ ఘన వ్యర్థాల నిర్వహణ పై ప్రజలందరికీ అవగాహన కల్పించడం కొరకు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (CRP) లను నియామకం చేస్తుంది.
- భారత ప్రభుత్వం , కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD) 2025 – 26 సంవత్సరానికి గాను ఆమోదించిన RGSA పథకం లో భాగంగా ఈ నియామకం చేస్తున్నారు.
🔥 మొత్తం ఎంత మంది CRP లను రిక్రూట్ చేస్తున్నారు ? :
- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9344 మంది CRP లను నియమించనున్నారు.
- జిల్లాల వారిగా
- 1.అనంతపురం – 687
- 2. చిత్తూరు – 799
- 3. తూర్పు గోదావరి – 1177
- 4. గుంటూరు – 862
- 5. కృష్ణా – 853
- 6. కర్నూల్ – 637
- 7. ప్రకాశం – 702
- 8. SPSR నెల్లూరు – 590
- 9. శ్రీకాకుళం – 559
- 10. విశాఖపట్నం – 602
- 11. విజయ నగరం – 479
- 12. పశ్చిమ గోదావరి – 881
- 13. వైఎస్ఆర్ కడప – 516
🔥CRP లుగా ఎంపిక చేసేందుకు గాను అర్హత ప్రమాణాలు :
- CRP లుగా ఎంపిక చేసేందుకు గాను ప్రత్యేకమైన అర్హతలు ఏమీ ప్రస్తావించలేదు. అయితే క్రియాశీల మహిళలు ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల (SHGs) మహిళా సభ్యుల నుండి ఎంపిక చేస్తారు.
🔥 CRP లను ఎంపిక చేయు విధానం :
- చెత్తను వేరు చేయు విషయంపై శిక్షణ పొందుటకు గాను క్రియాశీల మహిళలు మరియు SHG సభ్యులను సమావేశపరిచి , ప్రయోగాత్మక ప్రదర్శన నిర్వహించి అందులో చురుకుగా పాల్గొన్న మహిళా సభ్యుల నుండి CRP లను ఎంపిక చేస్తారు.
- మండల స్థాయిలో వీలైనన్ని గ్రామ పంచాయతీలలో నుండి మహిళా సభ్యుల ప్రాతినిధ్యం వహించేలా ఎంపిక చేస్తారు.
- DPO, ZP CEO, ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ ల పర్యవేక్షణ ద్వారా CRP ల ఎంపిక మరియు శిక్షణ జరుగుతుంది.
🔥 CRP లకు శిక్షణ :
- రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన CRP లకు వారి జిల్లా కేంద్రాలలో సుప్రీం లోకల్ ట్రైనింగ్ సెంటర్లు / అభివృద్ధి పరిచిన LTC ల నందు DPO ,ZP CEO మరియు జిల్లా పంచాయతీ రీసోర్స్ సెంటర్ అధికారుల చేత శిక్షణ ఇస్తారు.
- శిక్షణ కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఆగస్టు 21వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీలోగా ఏదైనా ఒక రోజు శిక్షణ ఇస్తారు.
- శిక్షణలో భాగంగా క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ గా ఎంపికైన వారికి కుటుంబ స్థాయిలో తడి మరియు పోడి చెత్తల నిర్వహణ , బిగ్ బ్యాంగ్ విధానం వివరణ & ఆరోగ్యం మరియు పరిశుభ్రత , గ్లౌజెస్ మరియు మాస్కుల వాడకం & కమ్యూనికేషన్ మరియు IEC పద్ధతులు పై శిక్షణ ఇస్తారు.
🔥 శిక్షణ పొందిన CRP లు ఏం చేయాలి ? :
- శిక్షణ పొందిన సిఆర్పి లను కుటుంబ స్థాయిలో శిక్షణ ఇచ్చింది గాను ఉపయోగిస్తారు.
- శిక్షణ పొందిన వారు ప్రతిరోజు గరిష్టంగా 50 కుటుంబాలకు మించకుండా వారి ఇంటి వద్దనే తడి మరియు పొడి చెత్త నిర్వహణ విధానాలపై శిక్షణ ఇవ్వాలి.
- 20 రోజులు క్షేత్రస్థాయిలో రోజుకు 50 కుటుంబాలు చొప్పున వెయ్యి కుటుంబాలకు శిక్షణ ఇవ్వడమే వీరి ప్రధాన లక్ష్యం.
🔥 CRP గా ఎంపిక అయిన వారికి 10,000 రూపాయలు :
- సీఆర్పీలుగా ఎంపికైన వారికి గౌరవ వేతనంగా పదివేల రూపాయలు అందజేస్తారు.
- సిఆర్పి లకు కేటాయించిన వెయ్యి కుటుంబాలకు అవగాహన కల్పించే నిమిత్తం సెప్టెంబర్ నెలలో 20 రోజులు క్షేత్ర స్థాయి ప్రాక్టికల్ డిమానిస్ట్రేషన్ కొరకు అక్టోబర్ లో 5000 రూపాయలు మరియు జనవరి 2026లో ఇంపాక్ట్ అసెస్మెంట్ తర్వాత ఫిబ్రవరి 2026 ల మరొక ఐదు వేలు అనగా మొత్తం పదివేల రూపాయలు గౌరవ వేతనంగా ఇస్తారు.