రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి పథకం అమలు పై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు.
🏹 ప్రతీ రోజూ వివిధ ప్రభుత్వ పథకాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఆడబిడ్డ నిధి పథకం వివరాలు – Click here
సూపర్ సిక్స్ పథకాల పై మంత్రి గారు క్లారిటీ :
నెల్లూరు జిల్లా చేజర్ల లో జరిగిన సుపరిపాలన లో తొలి అడుగు అనే కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు త్వరలో అమలు చేయబోయే పథకాలకు సంబంధించి ఆయన ప్రజలకు వివరించారు.
🏹 అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో చెప్పిన CM గారు – Click here
అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి పథకం అమలు :
సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్రంలో కోటను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు.
తమ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలను వరుసు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పెన్షన్లు, దీపం పథకం, తల్లికి వందనం పథకాలు అమలు చేశామని తెలిపారు.
- అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఈ నెలలోనే అర్హులైన రైతుల అకౌంట్ లో జమ చేస్తామని స్పష్టం చేశారు.
- ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని తెలియజేశారు.
🏹 తల్లికి వందనం పథకం 2వ విడత నిధులు విడుదల తేదీ – Click here
- ఆడబిడ్డ నిధి పథకం కూడా త్వరలో అమలు చేయబోతున్నట్టు మంత్రిగారు తెలిపారు.