అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జూన్ నెలలో జమవుతాయని రైతులు ఎదురు చూశారు.. కానీ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జూన్ నెలలో జమ కాలేదు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ ఎప్పుడు చేస్తారు అనే దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు.
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జూలై నెలలో కేంద్ర ప్రభుత్వ నుండి పీఎం కిసాన్ పథకం డబ్బులు జమ చేసేటప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ చేస్తుందని ముఖ్యమంత్రి గారు టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో తెలియజేశారు.
పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎంత లబ్ది చేకూరుతుంది ?
పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొత్తం రైతుల అకౌంట్ లో 20,000/- రూపాయలను ప్రభుత్వం జమ చేస్తుంది.
ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా క్రింద 6,000/- రూపాయలను జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా క్రింద 14,000/- రూపాయలను జమ చేస్తారు.
కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ప్రతిసారి 2,000/- రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులు విడుదల చేసే సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేస్తుంది.
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ చేసేది ఎప్పుడు ?
పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో 2,000/- రూపాయలు జమ చేసే సందర్భంలో అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా క్రింద 5,000/- రూపాయలను ప్రభుత్వం జమ చేస్తుంది. అంటే మొదటి విడతలో మొత్తం 7,000/- రూపాయలను ప్రతి రైతు అకౌంట్ లో జమ చేస్తారు.
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ ఆలస్యం ఎందుకంటే ? :
అన్నదాత సుఖీభవ పథకం మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా జమ చేయాల్సిన డబ్బులు ఆలస్యం కావడానికి ముఖ్య కారణం ఇంకా రాష్ట్రంలో 64 వేల మంది రైతులు ఈ కేవైసీ పూర్తి చేయకపోవడం. అందువల్లనే ఈ పథకం డబ్బులు జమ ఆలస్యం అవుతుంది అని కేంద్ర ప్రభుత్వ అధికారులు జమ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా రైతులు తమ ఈ కేవైసీ పూర్తి చేయకపోతే మీ దగ్గరలో ఉన్న రైతు సేవ కేంద్రంలో సంప్రదించి ఈ కేవైసీ పూర్తి చేయండి. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే మీ అకౌంట్ లో పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ కావు.