రేషన్ పంపిణీ లో కీలక మార్పులు | వీరికి 5 రోజులు ముందే రేషన్ పంపిణీ | AP Ration Distribution Latest News

ఏపీ లో రేషన్ పంపిణీ
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపు ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసింది ఇందులో భాగంగా రేషన్ డీలర్లకు పలు మార్గదర్శకాలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం , వృద్ధులు మరియు దివ్యాంగులకు ఇంటి వద్దకి రేషన్ పంపిణీ చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఆ నెల 1వ తేదీ నుండి 5వ తేదీ లోపుగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఈ విషయమే రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు మరియు దివ్యాంగులు సౌకర్యార్థం వీరికి ఒకటవ తేదీ కంటే ముందే రేషన్ పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

అలానే రేషన్ E-KYC కి సంబంధించిన ముఖ్య సమాచారాన్ని కూడా ఈ ఆర్టికల్ లో తెలియజేయడం జరిగింది.

🔥 జూలై నెల రేషన్ పంపిణీకి సర్వం సిద్ధం :

  • జూలై నెలకు సంబంధించి రేషన్ పంపిణీ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత నెల రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్నచిన్న అవాంతరాలను కూడా ఎదుర్కొనే విధంగా మరింత పటిష్టంగా రాసిన పనిచేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.
  • ఈసారి మరింతగా డీలర్లను, అధికారులను సమాయత్తం చేయడం ద్వారా రేషన్ పంపిణీ విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తల్లికి వందనం పథకం చివరి తేదీ పొడిగింపు – Click here

🔥వృద్ధులకు , దివ్యాంగులు వారికి 5 రోజులు ముందే రేషన్ పంపిణీ :

  • రాష్ట్రంలో గల వృద్ధులు మరియు దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. వీరికి మిగతా రేషన్ లబ్ధిదారులతో పోలిస్తే ఒక ఐదు రోజుల ముందే రేషన్ పంపిణీ చేసేందుకు గాను నిర్ణయం తీసుకుంది.
  • గతంలో ఒకటవ తేదీ నుండి 5వ తేదీ లోపుగా అందరితో సహా వీరికి రేషన్ పంపిణీ చేయమని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ విషయంలో డీలర్లకు , దివ్యాంగులకు మరియు వృద్ధులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రహించి జూలై నెల నుండి ఒక ఐదు రోజుల ముందుగానే ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది.
  • వృద్ధులకు మరియు దివ్యంగులకు ఈనెల 26 నుండి 30 వా తేదీలోగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేందుకు గాను అవకాశం ఉంది.

🔥 రేషన్ పంపిణీ కోసం EKYC ను 30/06/2025 లోగా పూర్తి చేసుకోండి :

  • కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారులు అందరూ కూడా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గతంలో రెండుసార్లు రేషన్ E-KYC కు సంబంధించిన గడువు తేదీని పొడిగించినప్పటికీ ఇంకా కొంతమంది లబ్ధిదారులు ఈ-కేవైసీ నమోదు చేసుకోలేదు .
  • వీరందరూ కూడా ఈనెల 30వ తేదీలోగా తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. లేదు అంటే వారి రేషన్ కార్డు లేదా ఆ సభ్యుని రేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంది.
  • ఈ కేవైసీ పూర్తి చేసుకోని వారు మీ సంబంధిత రేషన్ డీలర్ వద్ద లేదా గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది వద్ద E-KYC నమోదు చేసుకోవచ్చు.
  • ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఈ-కేవైసీ నమోదు చేసుకోవలసిన అవసరం లేదు, ఐదు సంవత్సరాలు దాటిన వారందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలి.
  • మీ రేషన్ కార్డు EKYC నమోదు అయింది లేనిది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *