తల్లికి వందనం పథకం కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారం తెలియ చేసింది. జూన్ నెల 12వ తేదీన తల్లికి వందనం పథకం ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు నగదు జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి సంబంధించి వివిధ కారణాల చేత అనర్హులుగా ఉన్న వారి నుండి అర్జీలు స్వీకరిస్తుంది.
అలానే ఈ విద్యా సంవత్సరం లో ఒకటవ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి కూడా అమౌంట్ రిలీజ్ చేసేందుకు సెకండ్ లిస్ట్ విడుదల చేయనుంది.
ఈ అంశాలకు సంబంధించి జూలై 10వ తేది తర్వాత నగదు లబ్ధిదారుల అకౌంట్ లలో జమ చేయనున్నామని అధికారిక వర్గాల నుండి సమాచారం లభిస్తుంది.
🏹 వివిధ ప్రభుత్వ పథకాలు సమాచారం ఎప్పటికప్పుడు మీ మొబైల్ కి రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లో ఉచితంగా జాయిన్ అవ్వండి.. మీ నెంబర్ ఎవరికీ కనిపించదు.
🔥కొనసాగుతున్న తల్లికి వందనం గ్రీవెన్స్ ప్రక్రియ & గ్రీవెన్స్ నమోదు చేసిన వారికి స్టేటస్ అప్డేట్ అయ్యింది :
- తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రామ, వార్డు సచివాలయం లలో గ్రీవెన్స్ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే గ్రీవెన్స్ నమోదు చేసిన వారి డేటా ప్రాప్తికి వారు అర్హులు అయ్యారా ? అనర్హులా? ఎలిజిబుల్ అయి ఉండి పేమెంట్ పెండింగ్ ఉందా ? వంటి రిమార్క్ కూడా అందులో ప్రస్తావించారు.
🏹 విద్యార్థుల కోసం విద్యా శక్తి కార్యక్రమం ప్రారంభించిన ప్రభుత్వం – Click here
🔥తల్లికి వందనం 2వ లిస్ట్ విడుదల మరింత సమయం :
- తల్లికి వందనం పథకం కి సంబంధించి ఒకటవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వారికి మరో లిస్ట్ విడుదల చేసి లబ్ధిదారులకు నగదు జమ చేయనున్నారు. అయితే ఇంకా అడ్మిషన్లు కొనసాగుతుండడం తో నగదు జమ చేసేందుకు గాను మరికొంత సమయం పట్టనుంది.
- మొదటి విడతలో 67.27 లక్షల విద్యార్థులకు ఈ పథకం అమలు చేశారు.
- కొత్తగా ఒకటవ తరగతిలో 5.5 లక్షలు మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేరిన వారు 4.7 లక్షల మంది ఉన్నారు.
- దీనితో లబ్ధిదారులు సంఖ్య మరింత పెరగనుంది.
🔥 ఈ నెల 10వ తారీఖున తల్లికి వందనం రెండవ విడత నిధులు :
- తల్లికి వందనం రెండవ విడత నిధులు 10వ తేదీన జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
- ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం , అదే రోజు నిధులు విడుదల చేసేందుకు నిర్ణయించింది.
- ఈ నెల 5వ తేదీన నిధులు విడుదల చేయాలని భావించినా , అడ్మిషన్లు ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.