యూనిక్ ఐడెంటిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ ఆధార్ సర్వీసులులలో భాగంగా ఇటీవల వివిధ మార్పులు తీసుకువస్తుంది. కొత్తగా నమోదు అయ్యే ఆధార్ కార్డు లలో గోప్యతా దృశ్యా పుట్టిన తేదీ ఇక నుండి కనిపించదు అని , ఆధార్ వివరాలలో తండ్రి పేరు / భర్త పేరును తొలగించడం జరిగింది అని తెలిపింది.
అలానే 5 సంవత్సరాలు దాటి ఆధార్ అప్డేట్ చేయని వారు మరియు 15 సంవత్సరాలు దాటిన వారి ఆధార్ అప్డేట్ చేయని వారు ఆధార్ అప్డేట్ చేసేందుకు సులభతరమైన వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు.
🏹 ఈ స్కాలర్షిప్ కు అప్లై చేస్తే 20,000/- ఇస్తారు – Click here
🔥 స్కూల్ & కాలేజ్ లలో ఆధార్ అప్డేట్ చేసేందుకు అవకాశం : (UIDAI Latest Guidelines)
- పిల్లల యొక్క ఆధార్ కార్డు మరియు వివరాలు అప్డేట్ చేసేందుకు గాను పాఠశాలలు లలో అవకాశం కల్పిస్తామని UIDAI CEO భువనేష్ తెలిపారు
- స్కూల్ మరియు కాలేజీ లలో ఆధార్ అప్డేట్ చేసేందుకు కొత్త విధానాన్ని తీసుకొని వస్తామని , మరో 45 నుండి 60 రోజులలో ఈ టెక్నాలజీ ను అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు.
- 5 సంవత్సరాలు వయస్సు దాటినా , బయోమెట్రిక్ అప్డేట్ చేయని వారు దేశ వ్యాప్తంగా 7 కోట్ల మంది ఉన్నారని వీరికి స్కూళ్ల లో ఆధార్ అప్డేట్ చేసేందుకు అవకాశం కల్పిస్తామని , వీరితో పాటుగా 15 సంవత్సరాలు దాటి ఆధార్ వివరాలు అప్డేట్ చేయని వారి కోసం కాలేజ్ లలో కూడా ఆధార్ అప్డేట్ కు అవకాశం కల్పిస్తామని చెప్పారు.
- ఏడేళ్ల దాటినా కూడా ఆధార్ అప్డేట్ చేయకపోతే ఆధార్ డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.