పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా అతి తక్కువ ధరతో ప్రమాద భీమా (Accidental insurance) అందిస్తున్నారు. కేవలం 62 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే వారికి 15 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది (Postal Department Insurance Policy). పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ప్రవేశపెట్టిన ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు అనగా పాలసీ మీరు ఏ విధంగా తీసుకోవాలి ? ఈ పాలసీ తీసుకునేందుకు అర్హతలు ఏమిటి? వంటి అంశాలు సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు?
🏹 Join Our What’sApp Group – Click here
🔥 యాక్సిడెంట్ బీమా తప్పనిసరిగా తీసుకోండి:
- ప్రస్తుత సమాజంలో ప్రతిరోజు ప్రయాణం అన్నది తప్పనిసరిగా మారింది. కూలీలు, ఉద్యోగులు , కాలేజ్ విద్యార్థులు , మహిళలు ఇలా అన్ని వర్గాలు వారు కూడా వారి వారి అవసరాలు నిమిత్తం ప్రతిరోజు ప్రయాణించాల్సి వస్తుంది.
- యాక్సిడెంట్ బీమా అన్నది వారితో పాటుగా ఆ కుటుంబ సభ్యులకు కూడా ఆసరాగా నిలుస్తుంది.
- ఆరోగ్య భీమా జీవిత విమానాలతో పాటుగా ప్రమాద బీమాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.
- అయితే ప్రమాద భీమా ఎక్కువ ఖర్చు తో కూడుకున్నది కావడం తో భీమా తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు.
- ఈ నేపథ్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వారు తీసుకువచ్చిన ఈ యాక్సిడెంటల్ భీమా అందరికి ఉపయోగపడే విధంగా ఉంది.
🔥నెలకు 62 రూపాయలు & సంవత్సరానికి 755 రూపాయల ప్రీమియం చెల్లించాలి:
- ఇండియన్ పోస్ట్ వారు అతి తక్కువ ప్రీమియం తో యాక్సిడెంటల్ భీమా అందిస్తున్నారు.
- నెలకు 62 రూపాయలు చొప్పున సంవత్సరానికి 755 రూపాయలు చెల్లిస్తే చాలు 15 లక్షల కవరేజ్ లభిస్తుంది.
- ఈ ప్రీమియం పొందిన వారికి అనుకోని సందర్భాలలో ప్రమాదం జరిగి మరణం సంభవించినా , శాశ్వత వైకల్యం పొందినా పూర్తి కవరేజ్ పొందే అవకాశం ఉంటుంది.
- యాక్సిడెంటల్ మెడికల్ రీయింబర్స్మెంట్ క్రింద ఒక లక్ష రూపాయలు లభిస్తుంది.
- ఆక్సిడెంట్ జరిగి ఎముకలు విరిగినట్లు అయిన , చేయి , కాలు విరిగిన వారికి 25,000/- రూపాయలు వరకు లభిస్తుంది.
- పాలసీదారులు హాస్పిటల్ లో సాధారణ చికిత్స పొందితే రోజుకి 1000/- రూపాయలు & ICU లో చేరితే 2000/-రూపాయలు చెల్లిస్తారు.
🔥10 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంది :
- పోస్టల్ డిపార్ట్మెంట్ వారు సంవత్సరానికి 299 /- రూపాయల పాలసీ తో 10 లక్షల పాలసీ ను కూడా ప్రవేశ పెట్టారు.
- ఈ పాలసీ తీసుకున్న వారికి మరణం సంభవించినా , అంగ వైకల్యం పొందినా , పక్షవాతం పొందినా వారికి 10 లక్షల కవరేజ్ పొందుతారు.
- అయితే వీరికి ఎటువంటి అదనపు సదుపాయాలు లభించవు.
🔥 పాలసీ పొందేందుకు ఎవరు అర్హులు ? ఏ విధంగా పాలసీ పొందాలి?:
- ఈ పాలసీ పొందేందుకుగాను 18 సంవత్సరాలు నిండి 65 సంవత్సరాలు లోపు వయస్సు కలిగి వుండాలి.
- పాలసీ పొందెందుకు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క అకౌంట్ కలిగి ఉండాలి. అకౌంట్ లేని వారు కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకొని యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఆ బ్యాంక్ సిబ్బంది వారిని అడిగితే వారు వివరాలు తెలియజేసి మీతో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయిస్తారు.
గమనిక :
ఈ ఆర్టికల్ ద్వారా మీకు పాలసీకి సంబంధించిన వివరాలు అవగాహన కోసం తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు అన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పాలసీ తీసుకోండి.