కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) ద్వారా స్వయం ఉపాధి పొందాలి అనుకుంటున్న యువతకు మంచి అవకాశాన్ని కల్పించింది. అతి తక్కువ వడ్డీ రేటు తో రుణాన్ని కల్పిస్తూ యువతకు ఉపాధి అవకాశాన్ని ఇస్తుంది.
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) యొక్క సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ మహిళలకు నెలకు 1,500/- పథకం లేటెస్ట్ అప్డేట్ – Click here
🔥 PMEGP అనగా ఏమిటి?:
- ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది వ్యవసాయేతర రంగంలో సూక్ష్మ సంస్థలను స్థాపించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడం అనే లక్ష్యంతో ప్రారంభించడం జరిగింది.
- ఇది కేంద్ర ప్రభుత్వ పథకం.
- యువతకు స్వయం ఉపాధి కొరకు సులభతరంగా రుణం మంజూరు చేయబడుతుంది.
- బ్యాంకు ద్వారా రుణం మంజూరు ప్రక్రియ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు వారికి సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తారు.
✅ Join Our Telegram Group – Click here
🔥 PMEGP కి దరఖాస్తు చేసుకొనేందుకు అర్హతలు :
- 18 సంవత్సరాలు దాటి ఉన్నవారు ఈ రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
- అయితే తయారీ రంగంలో పది లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసే ప్రాజెక్టులకు కనీసం ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాల్సి ఉంది మరియు వ్యాపార/ సేవా రంగంలో ఐదు లక్షలు కేటాయించారు.
- కొత్తగా యూనిట్ లోని ఏర్పాటు చేసిన వారు మాత్రమే ఈ పథకం కింద లోన్ పొందేందుకు అర్హత కలిగి ఉంటారు.
🔥 PMEGP కొరకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ?:
- PMEGP ద్వారా రుణం కావాలి అనుకునే వారు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥PMEGP ద్వారా చేకూరే లబ్ది :
- ఈ పథకం ద్వారా గరిష్ఠంగా 25 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు.
- సేవా రంగంలో 10 లక్షల రుణ మంజూరు కి గాను 15 శాతం నుండి 35 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది.
- తయారీ రంగంలో 25 లక్షల రుణ మంజూరు కి గాను 15 శాతం నుండి 35 శాతం సబ్సిడీ లభిస్తుంది.
- రుణం చెల్లించడానికి మూడు సంవత్సరాల నుండి గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు కాలపరిమితి నిర్ణయిస్తారు.
🔥PMEGP పథకం దరఖాస్తు కొరకు అవసరమగు ధ్రువపత్రాలు :
- ఈ పథకం కింద సబ్సిడీ రుణం పొందేందుకుగాను ఈ క్రింద పేర్కొన్న ధృవపత్రాలు అవసరమవుతాయి. అవి:
- ఆధార్ కార్డ్
- 8వ తరగతి సర్టిఫికేట్
- బిజినెస్ యొక్క ప్లాన్
- రేషన్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- బ్యాంక్ అకౌంట్
- సేవా లేదా తయారీ రంగాలకు సంబంధించి మీరు ప్రారంభించే వ్యాపారం యొక్క కొటేషన్
- ఇతర ధ్రువపత్రాలు ఏమైనా (ఉదాహరణ : దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్… వంటివి).