NTR Bharosha Pension : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆగస్టు 1న పంపిణీ కొరకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవల గ్రామ , వార్డు సచివాలయ సిబ్బంది ట్రాన్స్ఫర్స్ అవ్వగా వారికి కొత్తగా చేరిన సచివాలయం లో పెన్షన్లు పంపిణీ చేసేందుకు లాగిన్లు క్రియేట్ చేయబడ్డాయి.
ఎప్పటిలానే ఈ నెల కూడా పెన్షన్ దారుల ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేస్తారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆగస్టు 1న కొత్తగా 1 లక్షకు పైగా కొత్త వితంతు పెన్షన్లు (స్పౌజ్ కేటగిరి క్రింద) మంజూరు చేస్తుంది. ఇందుకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) శాఖా మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలియచేశారు.
✅ AP మహిళలకు నెలకు 1500/- పథకం లేటెస్ట్ న్యూస్ – Click here
🔥 ఆగస్టు 01 నుండి కొత్త స్పౌజ్ పెన్షన్లు పంపిణీ (NTR Bharosha Pensions) :
- రాష్ట్రంలో NTR భరోసా పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగంగా కొత్తగా స్పౌజ్ పెన్షన్ మంజూరు అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చామని , పెన్షన్ తీసుకొనే భర్త చనిపోతే వీలనంత త్వరగా వారి భార్య కి పెన్షన్ మంజూరు చేస్తామని మంత్రిగారు తెలిపారు.
- ఆగస్టు 01 నుండి కొత్తగా 1,09,155 మందికి వితంతు పెన్షన్లు మంజూరు చేశామని వారికి ఆగస్టు 01 వ తేదీ నుండి వారి ఇంటి వద్దే పెన్షన్లు పంపించేస్తామని తెలిపారు.
- వీరికి పెన్షన్ మంజూరు చేయు నిమిత్తం 43.66 కోట్లు రూపాయలు అదనంగా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అని తెలిపారు.
రాష్ట్రంలో చాలా మంది వితంతువులు ఎప్పటినుండో వితంతు పెన్షన్ కొరకు ఎదురు చేస్తూ ఉండడంతో వారికి ఇది ఒక శుభ పరిమాణం. రాష్ట్ర ప్రభుత్వం వీరికి ప్రతీ నెల 4,000 రూపాయలు అందించనుంది.