నమో డ్రోన్ దీదీ పథకం : రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి , మహిళా సాధికారతకు కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉండగా…ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో 80 శాతం సబ్సిడీ తో మహిళలకు డ్రోన్లు అందించనున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ఇప్పటికే మొదలు అవ్వగా, మరికొద్ది రోజులలో స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకు డ్రోన్లు పంపిణీ జరగనుంది.
ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం మీ మొబైల్ కి రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ గ్రూపులో ఉచితంగా జాయిన్ అవ్వండి..
🏹 Join Our What’sApp Group – Click here
🔥నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా మహిళలకు 80 శాతం రాయితీ తో డ్రోన్లు:
- కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకం అమలు చేస్తుంది.
- ఈ పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలు కి సబ్సిడీ ఆధారంగా డ్రోన్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- వ్యవసాయ రంగ అభివృద్ధికి మరియు మహిళా సాధికారత కు ఉపయోగపడేలా రాష్ట్రం లోని స్వయం సహాయక సంఘాలలో గల మహిళలకు 80 శాతం సబ్సిడీ తో డ్రోన్లు అందిస్తారు. ఈ సబ్సిడీ ను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిసి అందిస్తున్నాయి.
- రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం లో మొత్తం 440 మంది మహిళలకు డ్రోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
🔥నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా 2 లక్షలు రుణం & 8 లక్షల సబ్సిడీ :
- నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా ఇచ్చే డ్రోన్ విలువ 10 లక్షలు కాగా ఇందులో 8 లక్షల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ ఇస్తారు.
- మిగతా రెండు లక్షలను బ్యాంకు లింకేజ్ కార్యక్రమం / స్త్రీనిధి / గ్రామ సంఘం నుండి లోన్ మంజూరు చేస్తారు.
✅ అటవీ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు – Click here
🔥 ప్రారంభం అయిన నమో డ్రోన్ దీదీ పథకం లబ్ధిదారులు గుర్తింపు ప్రక్రియ :
- ఈ కార్యక్రమం కి సంబంధించి లబ్ధిదారులు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
- SERP అధికారులు ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. అధికారులు 88 మంది లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేశారు.
- మిగిలిన లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేసి , అతి త్వరలో వీరు అందరికీ కూడా వీలైనంత త్వరగా లబ్ధిదారులకు డ్రోన్ లను అందిస్తారు.
- ప్రభుత్వమే ఈ డ్రోన్లు ను ప్రముఖ సంస్థల నుండి కొనుగోలు చేస్తుంది.
- మీకు నమో డ్రోన్ దీదీ పథకం పట్ల ఆసక్తి ఉంటే SERP అధికారులను సంప్రదించవచ్చు..
🔥 డ్రోన్ల వినియోగం పై ప్రభుత్వ శిక్షణ :
- లబ్ధిదారులకు అందించే ఈ డ్రోన్లు బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి DH – AG – E10 రకం డ్రోన్లు పంపిణీ చేయబడతాయి.
- ఇవి కేవలం 15 KG ల బరువు ను కలిగి ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని ఎక్కడికైనా చాలా సులభంగా తీసుకొని వెళ్లవచ్చు.
- ఈ డ్రోన్ లను ఎలా ఉపయోగించాలి? డ్రోన్ పైలెట్ కి తెలియవలసిన అంశాలు , వంటి అన్నిటిని నేర్పించేందుకు ప్రభుత్వమే శిక్షణ అందిస్తుంది.
- ఈ శిక్షణ ను ఉపయోగించుకొని మహిళలు డ్రోన్ పైలెట్ గా మారి వారి ఆర్థిక స్థితిగతులను మార్చుకోవచ్చు.
✅ Namo Drone Didi Scheme Details – Click here