ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని , ఆడబిడ్డ నిధి పథకం కూడా అతి త్వరలో అమలు చేస్తామని, ఇందు కొరకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలియచేసారు.
నంద్యాల జిల్లా గడివేముల మండలం దుర్వేసి లో ” సుపరిపాలన తొలి అడుగు ” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గారు వివిధ అంశాల పై మాట్లాడారు.
🏹 ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇలా చేయండి – Click here
🔥ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తాం :
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలిపారు.
- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం ఈ పథకం అమలు జరుగుతుంది అని చెప్పారు.
- సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్ని పథకాలను అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.
- ఆడబిడ్డ పథకం ద్వారా మహిళా సాధికారతకు ప్రోత్సహిస్తామని , ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించి ఉద్దేశ్యం తో ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని రూపొందించారు అని ప్రస్తావించారు.
✅ Join Our What’sApp Group – Click here
🔥ఆడబిడ్డ నిధి పథకం కోసం కావలసిన డాక్యుమెంట్స్ ? :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు లోపు వయస్సు లోపు గల మహిళలకు సంవత్సరానికి ప్రతీ నెల 1500/- రూపాయలు చొప్పున వారి బ్యాంక్ ఖాతా లో జమ చేసే పథకమే ఆడబిడ్డ నిధి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న మహిళలు ఈ పథకానికి అర్హత కలిగి ఉంటారు.
- దారిద్రరేఖకు దిగువన ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
- ఆధార్ కార్డు , రేషన్ కార్డ్ , కుల ధ్రువీకరణ పత్రం , ఆదాయ ధ్రువీకరణ పత్రం వంటివి అవసరం అవుతాయి.