AP Work From Home Jobs : నిరుద్యోగులకు శుభవార్త ! ఈ సారి మరింత పక్కాగా వర్క్ ఫ్రం హోమ్ సర్వే | మీ ఇంటి వద్దకే వస్తారు.

AP Work From Home Survey Details
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎంతగానో కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు వయస్సు గల వారి వివరాలలో చదువుకున్న వారి వివరాలను సేకరించింది. ఇప్పుడు ఎవరైతే వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ( AP Work From Home Jobs) చేసేందుకు ఇష్టపడతారో వారందరికీ మరొకసారి సర్వే చేయాలని నిర్ణయించింది . ఈ సర్వేలో నిరుద్యోగులు యొక్క వివరాలు పూర్తిగా పరిశీలించి , సేకరించనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి వర్క్ ఫ్రం హోం సర్వే (NEW) చేస్తుంది గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఈ వర్క్ ఫ్రం ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ఫ్రం హోమ్ సర్వే కి సంబంధించి సర్వే ఏవిధంగా చేస్తారు. పౌరులు ఏ విధమైన సమాచారం అందించాలి ? వంటి మరిన్ని వివరాలు కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.

🔥 వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ప్రధాన లక్ష్యం (The main objective of the AP work from home survey) :

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యాగ అవకాశాలు కల్పించాలని భావిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా work from home new సర్వే ను నిర్వహిస్తుంది.
  • ఇందులో భాగంగా సర్వే ను ఇప్పటికీ ప్రారంభించింది.
  • రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వర్క్ ఫ్రం హోమ్ ప్రధాన లక్ష్యం ఏమనగా రాష్ట్రంలో ఐటిఐ, డిప్లొమా , డిగ్రీ , పీజీ,ఇతర ఉన్నత చదువులు చదివిన వారికి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను కల్పించడం ప్రధాన లక్ష్యం.

డిగ్రీ చదివిన వారికి 10,277 ప్రభుత్వ ఉద్యోగాలు – Click here

🔥 వర్క్ ఫ్రం హోమ్ సర్వే చేయు విధానం (How to do AP work from home survey) :

  • వర్క్ ఫ్రం హోమ్ సర్వే చేసేందుకు గాను గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది యొక్క employee mobile app నందు అవకాశం కల్పించారు.
  • ఇందులో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగి వారి యొక్క లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయి work from home new అనే టైల్ లో వారికి కేటాయించిన క్లస్టర్ లో ప్రీ పాపులేటెడ్ గా ఉన్న పేర్లకు సర్వే చేస్తారు.
  • ముందుగా అందులో వచ్చిన పేరు పై క్లిక్ చేసి , ఆ అభ్యర్థి యొక్క ఆధార్ అధంటీకేషన్ ( బయోమెట్రిక్ / ఫేషియల్ / ఐరిష్ / OTP ) తీసుకుంటారు.
  • అధంటీకేషన్ పూర్తి అయ్యాక సిటిజన్ ప్రాధమిక వివరాలు డిస్ప్లే కాబడతాయి.
  • ఆ తర్వాత సిటిజన్ మొబైల్ నెంబర్ & ఇమెయిల్ ఐడి నమోదు చేసి , వెరిఫై చేయాలి.
  • ఇక్కడ నుండి వర్క్ ఫ్రం హోమ్ సర్వే కి సంబంధించి , వివరాలు సేకరణ జరుగుతుంది.
  • ముందుగా సిటిజన్ కి అవగాహన ఉన్న భాషలను ( Languages known) నమోదు చేసుకోవాలి.
  • ఆ తర్వాత సిటిజన్ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ (Phd / post graduate/ post graduate diploma/ graduate/ dipooma/ ITI) వివరాలు నమోదు చేసుకోవాలి.
  • ఆ తర్వాత సిటిజన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏ స్పెషలిజేషన్ లో పూర్తి చేసారో నమోదు చేయాలి.
  • ఆ తర్వాత క్వాలిఫికేషన్ లో వారికి వచ్చిన మార్కుల వివరాలను పర్సంటేజ్/ CGPA విధానంలో నమోదు చేసి, ఏ సంవత్సరం లో విద్య ( pass out year) ను పూర్తి చేశారు అన్న వివరాలు కూడా నమోదు చేయాలి.
  • ఆ తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి.
  • సర్వే లో భాగంగా ఇప్పుడు వారు చదివిన ఇన్స్టిట్యూట్ వివరాలు నమోదు చేయాలి. ( With in AP/ outside AP/ out side india)
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చదువుతున్నట్లు అయిన ఏ జిల్లా లో చదివారు , ఇన్స్టిట్యూట్ పేరు / యూనివర్సిటీ పేరు సెలెక్ట్ చేసుకోవాలి.
  • చివరిగా పౌరునికి ఇతర ఏమైనా విద్యార్హతలు ఉంటే ఆ వివరాలు కూడా నమోదు చేసి , సబ్మిట్ చేయాలి. ఇంతటితో సర్వే పూర్తి అవుతుంది.

🔥నిరుద్యోగులు ఇలా చేయండి :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సర్వే అన్నది నిరుద్యోగులకు చాలా ఉపయోగకరం. కావున నిరుద్యోగులు అందరూ తప్పనిసరిగా ఈ సర్వే లో పాల్గొని , సర్వే చేయి సచివాలయం సిబ్బందికి సహకరించగలరు.
  • పనిచేస్తున్న ఫోన్ నెంబర్ మరియు ఈ మెయిల్ ఐడి ను నమోదు చేయించుకోండి.
  • మీ విద్యార్హత సర్టిఫికెట్ కాపీలను , విద్యార్హత వివరాలను స్పష్టంగా సర్వే చేయు సిబ్బందికి తెలియచేయండి.
  • అదనపు విద్యార్హతలు ఏమైనా ఉన్నా ఆ వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేసుకోండి.
  • రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే లో వచ్చే వివరాలు ఆధారంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *