AP NTR Bharosha Spouse Pensions : రాష్ట్ర ప్రభుత్వం NTR భరోసా పెన్షన్ పథకం ద్వారా ఇంటి వద్ద కే పెన్షన్ పంపిణీ వేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఎటువంటి అవాంతరాలు లేకుండా పెన్షన్ పంపిణీ జరుగుతుంది.
అలానే రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన పెన్షన్ దారుల భార్యలకు పెన్షన్ ఇచ్చేందుకు గాను కొత్తగా స్పౌజ్ ఆప్షన్ ద్వారా వితంతు పెన్షన్లు మంజూరు చేయాలి అని అధికారిక సర్క్యులర్ ఇచ్చి , స్పౌజ్ పెన్షన్ మంజూరు చేస్తుంది.
ఇందులో భాగంగా మరో కీలక అప్డేట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోగలరు.
✅ రైతుల కోసం మరో కొత్త పథకం ప్రారంభం – Click here
🔥 AP NTR Bharosha Spouse Pensions కొరకు వీరికి అవకాశం:
- రాష్ట్ర ప్రభుత్వం స్పౌజ్ పెన్షన్ దరఖాస్తు కొరకు గతంలో ఇచ్చిన సర్క్యులర్ లో నవంబర్ 31 / 2024 తర్వాత చనిపోయిన పెన్షన్ దారుల భార్యలకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు..
- అయితే ఆ తేదీ కంటే ముందే చనిపోయిన వారికి అవకాశం ఇవ్వలేదు.
- దీని కొరకు రాష్ట్ర ప్రభుత్వం 2019 నుండి 2024 వరకు చనిపోయిన అందరి పురుష పెన్షన్ దారుల భార్యల వివరాలను Wife details capture సర్వే నిర్వహించి సేకరించారు.
- ఇందులో ఎవరైతే స్పౌజ్ పెన్షన్ కు అర్హులో వారికి పెన్షన్ మంజూరు ప్రక్రియ ప్రారంభించారు.
🔥How to Apply AP NTR Bharosha Spouse Pensions ?:
- గతంలో వైఫ్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసిన వారిలో పెన్షన్ కు అర్హత కలిగిన వారి పేర్లు సచివాలయ సిబ్బంది లాగిన్ కి ఇవ్వడం జరిగింది.
- వీరు సంబంధిత లబ్ధిదారుల నుండి భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం తీసుకొని , సంబంధిత వివరాలు సరిచూసుకుని లాగిన్ నందు అప్లోడ్ చేస్తారు.
- ఆ తర్వాత ఆ వివరాలు MPDO లాగిన్ కి ఫార్వర్డ్ కాబడతాయి.
- ఆ వివరాలు ను MPDO వారు కన్ఫర్మ్ చేయాలి.
- ఈ వివరలు అన్ని నమోదు చేసేందుకు గాను జూలై 31 వరకు గడువు విధించారు.
- ఆ తర్వాత స్పౌజ్ పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది.