ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు (AP New Ration Cards) పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గతంలో తెలిపిన విధంగానే క్యూఆర్ కోడ్ కలిగిన రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆగస్టు నెలలో రేషన్ కార్డులు పంపిణీ జరగనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు.
ఈ అంశానికి సంబంధించి సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🏹రైతులు కోసం ప్రభుత్వం కొత్త పథకం – Click here
🔥ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గల అందరూ రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకుగాను ముహూర్తం ఖరారు చేసింది.
- ఆగస్టు నెలలో క్యూఆర్ కోడ్ కలిగిన ఏటీఎం కార్డ్ సైజు రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
- క్యూఆర్ కోడ్ కలిగిన ఈ రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కార్డులో ఉన్న వ్యక్తులు వివరాలు తెలుసుకునేందుకుగాను అవకాశం ఉంటుంది.
- ప్రభుత్వ అధికార చిహ్నము , లబ్ధిదారుల ఫోటో మాత్రమే ఈ రేషన్ కార్డు పై ఉంటాయి. ఎటువంటి నేతల ఫోటోలు ఈ రేషన్ కార్డు పై ముద్రించరు.
🔥 కొత్తగా దరఖాస్తు చేసుకొన్న వారికి కూడా నూతన రేషన్ కార్డుల పంపిణీ :
- గత నెలలో నూతనంగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.
- నూతన రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివిధ సర్వీసులు ఇచ్చింది ఇందులో భాగంగా కొత్తగా సభ్యుణ్ణి చేర్చుకొనుట , రేషన్ కార్డు విభజన కొరకు , రేషన్ కార్డులో సభ్యులు తొలగించుట (మరణించిన వారిని) , రేషన్ కార్డు అడ్రస్ మార్చుకొనుట వంటి సర్వీసులను అందుబాటులోకి వచ్చింది.
- వీరికి కూడా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి వెరిఫికేషన్ రిక్రియ పూర్తయిన వారికి కూడా నూతనంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది.
- రాష్ట్రంలో గల 1.46 కోట్ల పాత రేషన్ కార్డ్ దారుల తో పాటు కొత్తగా మరో 2 లక్షలకు పైగా దరఖాస్తు దారులకు నూతన రేషన్ కార్డ్ ల పంపిణీ చేస్తారు.