కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (PM Kissan) ను కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండే అమలు చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి 20వ విడత నిధుల విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది.
మరికొద్ది రోజులలో ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది. రాష్ట్రం లో అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ పథకం తో అమలు చేసే అవకాశం ఉండడం తో రాష్ట్ర ప్రజలు పీఎం కిసాన్ పథకం అమలు పై ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
🏹 అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులా ? కాదా ? ఇలా తెలుసుకోండి – Click here
🔥 జూలై 18న పీఎం కిసాన్ నిధులు విడుదల ? :
- పీఎం కిసాన్ పథకం ద్వారా 20వ విడత నిధులు కేంద్ర ప్రభుత్వం మరికొద్ది రోజులలో అమలు చేయనుంది.
- ఈ నెల 18 వ తేదీన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు విడుదల చేయాలని భావిస్తున్నట్లు జాతీయ మీడియా లో వార్త విడుదల అయ్యింది.
- ఈ నెల 20 వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
- మోడీ బీహార్ పర్యటన కంటే ముందే పీఎం కిసాన్ నిధులు జమ చేయనున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
🏹 Join Our What’s App Group – Click here
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు ?
- పీఎం కిసాన్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా నిధులు విడుదల చేయనుంది.
- PM Kissan పథకంలో భాగంగా 2,000/- రూపాయలు జమ కనునున్నాయి. Annadata Sukhibhava పథకం డబ్బులు 5,000/- జమ చేస్తారు.
అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ ఇలా తెలుసుకోండి :
అన్నదాత సుఖీభవ పథకానికి మీకు అర్హత ఉందా లేదా అనేది చాలా సులభంగా తెలుసుకోవచ్చు.. దీనికోసం మీరు క్రింది ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ మరియు అక్కడే ఇచ్చిన CAPTCHA సరిగ్గా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అర్హత ఉంటే మీ వివరాలు కనిపిస్తాయి. మీకు అర్హత లేకపోతే మీకు వివరాలు కనిపించవు. మీ వివరాలు కనిపించకపోతే మీ గ్రామ సచివాలయం లేదా రైతు సేవా కేంద్రంలో సంప్రదించి అర్జీ పెట్టాలి. అర్జీ పెట్టిన తర్వాత మీకు అన్ని అర్హతలు ఉంటే తప్పనిసరిగా మీకు కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదలవుతాయి.
🏹 Annadata Sukhibhava Status – Click here