ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతిష్టాత్మకమైన పథకమైన ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి పథకం) పథకం ను ఈ వచ్చే రాఖీ పండుగ నాడు అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించనున్నారు.
ఈ పథకానికి సంబంధించి ఎప్పటికీ స్త్రీ శక్తి అనే పేరును నిర్ణయించగా, క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది. పథకం అమలు కొరకు అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తోంది. ఆగస్టు 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకంలో అధికారికంగా ప్రకటిస్తారు.
Table of Contents :
✅ ఆంధ్రప్రదేశ్ సీడాప్ సంస్థలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here
🔥 ఆగస్టు 09 న స్త్రీ శక్తి పథకం అధికారిక ప్రకటన :
- ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనుంది.
- ఈ పథకానికి సంబంధించి అమలు చేసేందుకు గాను ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటనను రక్షాబంధన్ దినోత్సవం నాడు అనగా ఆగస్టు 9వ తేదీనాడు అధికారికంగా ప్రకటించనున్నారు.
- ఈ పథకానికి స్త్రీ శక్తి అనే పేరును నిర్ణయించడం జరిగింది.
- రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు బహుమతిగా ఈ పథకాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు.
- స్త్రీలతో పాటుగా ట్రాన్స్ జెండర్లకు కూడా ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు.
- రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి రాష్ట్రంలో ఏదైనా ప్రాంతానికి ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.
- రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా గుర్తింపు కార్డు అయినటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్ వంటివి కచ్చితంగా తీసుకొని వెళ్ళాలి.
- ఎవరైతే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వినియోగించుకుంటారు వారికి బస్సులలో జీరో పేరు టికెట్ అందిస్తారు.
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం బస్సులలో 74% ఈ స్త్రీ శక్తి పథకం అమలు కొరకు వినియోగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6700 బస్సులను ఈ పథకంలో భాగంగా ఉపయోగపడుతున్నాయి.
- పల్లె వెలుగు , అల్ట్రా పల్లె వెలుగు , మెట్రో ఎక్స్ప్రెస్ , సిటీ ఆర్డినరీ , ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తారు.
- ఈ పథకం అమలు కొరకు మొత్తం 1950 కోట్లు కేటాయించనున్నారు.
🔥రద్దీ పెరిగితే స్కూల్ బస్ లు వినియోగిస్తాం – మంత్రి గారు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నామని , గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా ఈ పథకం ప్రారంభం కానుందని రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ రాంప్రసాద్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మీడియా ముఖంగా తెలియజేశారు.
- ఈ పథకాన్ని వినియోగించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండి రద్దీ పెరిగితే అవసరమైతే స్కూల్ బస్సులను కూడా వినియోగిస్తామని, అయితే వాటిని పాఠశాల వేళలలో ఉపయోగించబోమని తెలిపారు