మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం స్త్రీ శక్తి పథకం ప్రారంభం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యాన్ని కల్పించనున్న విషయం తెలిసిందే. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ను రాష్ట్ర ప్రభుత్వం ” స్త్రీ శక్తి ” అనే పథకం పేరుతో అమలు చేయనుంది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు అప్డేట్లు ఇస్తూ ఉంది.
మరికొద్ది రోజులలో అమలు చేయనున్న ఈ పథకం కి సంబంధించి మార్గదర్శకాలు అధికారికంగా విడుదల కావాల్సి ఉంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సమాచారం ఆధారంగా హైలైట్స్ ఏంటో చూద్దాం.
✅ రాష్ట్రంలో ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు , ఇలా అప్లై చేయండి – Click here
Table of Contents :
🔥 స్త్రీ శక్తి పథకం తో 6700 బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం :
- రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం ” స్త్రీ శక్తి ” ను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
- ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6700 బస్ లను కేటాయించారు.
- 3 వేల ఎలెక్ట్రిక్ బస్ ల కొనుగోలు కొరకు CM గారు ఆదేశించారు.ఇందులో భాగంగా వచ్చే 2 సంవత్సరాలలో 1400 ఎలెక్ట్రిక్ బస్ లను కొనుగోలు చేస్తారు.
- ప్రజలకు & మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ సౌకర్యంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
- బస్ ల సంఖ్య పెరగడంతో ఆర్టీసీ సంస్థ నియామకాలు చేయనుంది. మెకానిక్ మరియు డైవర్ల నియామకాన్ని మరి రెండు రోజులలో ప్రారంభించనున్నారు. వీటితో పాటు ఆర్టీసీ సంస్థ లో కారుణ్య నియామకాలు కూడా చేపడతారు.
✅ NTR వైద్య సేవ పథకంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు – Click here
🔥5 రకాల బస్ లలో బస్ ప్రయాణం ఉచితం & రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా :
- స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఇందులో ఎటువంటి పరిమితులు ఉండవు. పూర్తి ప్రయాణం ఉచితంగా చేయవచ్చు.
- పల్లె వెలుగు బస్సులు , అల్ట్రా పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు , మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు, సిటీ ఆర్డినరీ బస్ లలో ప్రయాణించేందుకు గాను అవకాశం కల్పిస్తున్నారు.
- మహిళలు కు ఉచిత బస్ ప్రయాణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1950 కోట్ల రూపాయలు కేటాయించింది..
- ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మెరుగైన విధంగా స్త్రీ శక్తి పథకం అమలు చేస్తారు.
🔥 ఐడి కార్డ్ తప్పనిసరి :
- స్త్రీ శక్తి – ఉచిత బస్ ప్రయాణం పథకం ను వినియోగించుకునేందుకు గాను మహిళకు ఏదైనా గుర్తింపు కార్డ్ ను తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. ఐడి కార్డ్ లేకుండా ఉచిత బస్ ప్రయాణం చేసేందుకు వీలు పడదు.
- ఆధార్ కార్డు , ఓటర్ ఐడి , రేషన్ కార్డ్ వంటివి గుర్తింపు కార్డ్ వలె ఉపయోగించవచ్చు.
- ఉచిత బస్ ప్రయాణం ను వినియోగించుకునే వారికి జీరో ఫేర్ టికెట్ ను అందిస్తారు.