చేనేత కుటుంబాల ఇళ్లకు మరియు పవర్ లూమ్స్ కు ఉచిత విద్యుత్ : రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల వారిని సంక్షేమ వైపు నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాల అమలతో పాటుగా వివిధ విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చేనేతకారులకు లబ్ధి చేకూరే విధంగా చేనేతకారుల సంక్షేమం కొరకు చేనేత దినోత్సవం అయిన ఆగస్టు 7వ తేదీ నుండి చేనేత కుటుంబాల ఇళ్లకు మరియు పవర్ లూమ్స్ కు ఉచిత విద్యుత్ అందించనున్నారు.
ఈ అంశానికి సంబంధించి ప్రాథమిక సమాచారం అందింది. మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం ఆగస్టు 07 నుండి ప్రారంభం :
- రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 07 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతకారులకు శుభవార్త తెలియచేసింది.
- చేనేత కారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆగస్టు 07 నుండి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
- ఈ పథకం ద్వారా చేనేత కారుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్ లభిస్తుంది.
- పవర్ లూమ్స్ ద్వారా నేత నేస్తున్న వారికి పవర్ లూమ్స్ నిర్వహణ కొరకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది.
✅ AP Free Bus travel scheme Latest Update – Click here
- ఈ పథకం అమలు చేయడం ద్వారా చేనేత కారుల కుటుంబాలకు నెలకు 1250/- రూపాయలు మరియు పవర్ లూమ్స్ (పవర్ మగ్గం) నిర్వహిస్తున్న వారికి 2,500 రూపాయలు ఆర్థిక లబ్ది చేకూరుతుంది.