ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకం ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (AP Free Bus Scheme). ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటూ ఈ పథకం అమలుకు కృషి చేస్తుంది.
ఇందులో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఈ పథకం యొక్క విధివిధానాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ ను చివరివరకు చదవండి.
✅ AP Nirudyoga Bruthi Scheme Date – Click here
🔥 74% Buses allocated for AP free bus travel scheme :
- రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15వ తేదీన అమలు చేయనున్న విషయం తెలిసిందే.
- ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
- ఈ పథకం అమలు కొరకు రాష్ట్రవ్యాప్తంగా 1350 కొత్త బస్సులను కేటాయించారు.
- 750 బస్సులు ఇప్పటికీ మంజూరు కాగా మరో 600 బస్సులను కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 11 వేల బస్సులలో 74 శాతం బస్సులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కొరకు కేటాయించడం జరుగుతుంది.
🔥 మహిళలకు బస్ ప్రయాణం ఒకే జిల్లాకు పరిమితం కాదా ? (Isn’t AP Free bus travel for women limited to a single district?) :
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని జిల్లాకు పరిమితం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినప్పటికీ ఈ అంశాన్ని తిరిగి మళ్ళీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
- ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని నూతన జిల్లాల ప్రాతిపదికన అమలు చేయాలని భావించినప్పటికీ ఉమ్మడి జిల్లాలకు విస్తరించాలని ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. అలానే రాష్ట్రం మొత్తం విస్తరించాలా అన్న అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
✅ Join Our What’sApp Group – Click here
🔥 బస్ స్టాప్ లలో & బస్ లలో సౌకర్యాలు మెరుగుదల (Improvement of facilities at bus stops & on buses) :
- ఆగస్టు 15 వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు మహిళలకు సౌకర్యాలు మెరుగు పరచాలని భావిస్తుంది.
- ఇందులో భాగంగా బస్ స్టాప్ లలో మరియు బస్సులలో సౌకర్యాలను మరింత విస్తృతం చేయనున్నారు.
- రాబోయే రెండు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్టాండ్ లోను త్రాగునీటి సౌకర్యం , కూర్చునేందుకు వీడిగా కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయనున్నారు.
- అవసరాన్ని బట్టి ప్రయాణికుల సంఖ్యను బట్టి పల్లె వెలుగు బస్సులు పెంపుదల కూడా చేయనున్నారు.