రాష్ట్రంలో మరికొద్ది రోజులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
ఉచిత బస్ ప్రయాణం అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలెక్ట్రిక్ బస్ లను కొనుగోలు చేసింది. అలానే కొత్తగా జీరో ఫేర్ టికెట్ అనే విధానాన్ని తీసుకువస్తుంది. అలానే ఈ పథకం అమలు కి సంబంధించి మార్గదర్శకాలు మరో మూడు రోజులలో విడుదల చేస్తామని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కొరకు మంత్రి గారు వెల్లడించిన వివిధ అంశాలను ఈ ఆర్టికల్ లో తెలియచేయడం జరిగింది.
✅ వివిధ ప్రభుత్వ పథకాలు సమాచారం మీ మొబైల్ కి రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి..
🔥మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం మార్గదర్శకాలు మరో మూడు రోజులలో :
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుండి అమలు చేయనున్నామని , ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ను మరో మూడు రోజులలో విడుదల చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు.
- రవాణా శాఖా మంత్రి రహదారుల అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ అంశాన్ని ప్రకటించారు.
✅ మహిళలకు నెలకు 1500/- పథకం లేటెస్ట్ అప్డేట్ – Click here
🔥మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం 1400 కొత్త బస్ లు సిద్ధం :
- రాష్ట్రం లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం అమలు నిమిత్తం కొత్తగా 1400 బస్ లను కొనుగోలు చేశామని , మహిళలకు , ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉచిత బస్ ప్రయాణం పథకం అమలు వుంటుంది అని తెలిపారు.
- కొత్తగా 2000 ఎలెక్ట్రిక్ బస్ లను కొనుగోలు చేస్తామని , రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జీరో యాక్సిడెంట్స్ అనే అంశంపై దృష్టి సారించారని అన్నారు.
- ఉచిత బస్ ప్రయాణం పథకం ను ఉపయోగించుకొనే మహిళలకు జీరో ఫేర్ టికెట్ ను ఇస్తామని , ఇందువలన వారికి ఎంత లబ్ది చేకూరుతుంది అనేది తెలుస్తుంది అని అన్నారు.
- ఉచిత బస్ ప్రయాణం పథకం వలన కలిగే ఆర్థిక భారం తగ్గించే కొరకు రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ కి ఇతర ఆదాయ మార్గాలు కూడా వెతుకుతున్నామని తెలిపారు.
🔥 ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం :
- ఉచిత బస్ ప్రయాణం వలన ఆటో డ్రైవర్లకు ఆదాయ తగ్గుతుంది అనే అంశంపై వారికి ఇబ్బందులు కలిగితే వారి కొరకు త్వరలో నిర్ణయం తీసుకుంటామని , వారి కొరకు కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని తెలిపారు.
- వారికి ఆర్థిక సహాయం చేసేందుకు మరి కొద్ది రోజులలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
