Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana Scheme : కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంలో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇందులో భాగంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహం లభించేలా స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన (Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana Scheme) అని నామకరణం చేసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఏదైనా డిగ్రీ , పీజీ, ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు చదువుతున్న అభ్యర్థులు ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన స్కాలర్షిప్ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు కొరకు అనగా ఈ స్కాలర్షిప్ కు ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఈ స్కాలర్షిప్ ద్వారా ఎంత లబ్ది చేకూరుతుంది ? అవసరమగు ధ్రువపత్రాలు ఏమిటి ? వంటి అన్ని అంశాల కొరకు ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥What is Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana Scheme?
- ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు అనగా డిగ్రీ పిజి ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులు చేస్తున్న వారికి వారి విద్యకు ఉపయోగించే విధంగా స్కాలర్షిప్ లభించే పథకం ప్రధానమంత్రి ఉచిత శిక్ష ప్రోత్సాహనా యోజన.
- ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకునేందుకుగాను కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
- కళాశాలలో మరియు యూనివర్సిటీలో చదువుతున్న పేద కుటుంబాలలో గల ప్రతిభావంతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
- భారత ప్రభుత్వ విద్యాశాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది.
🔥 Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana Scheme required Qualification :
- ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హతలో 80% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ప్రస్తుతం రెగ్యులర్ విధానంలో డిగ్రీ అభ్యసిస్తూ ఉండాలి.
- కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 4.5 లక్షల లోపు ఉండాలి.
- ప్రభుత్వం ఇచ్చే ఇతర స్కాలర్షిప్ పథకాలు యొక్క ప్రయోజనాన్ని పొంది ఉండరాదు.
✅ ఉన్నత విద్య కు తోడ్పాటు అందించే పీఎం విద్యాలక్ష్మి పథకం – Click here
🔥 Required Age For Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana Scheme :
- విద్యార్థులు 18 సంవత్సరాలు నిండి నుండి 25 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి.
🔥 Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana Scheme Benifits :
- ఈ స్కాలర్షిప్ పథకానికి ఎంపికైన వారికి వారు చదువుతున్న కోర్సు ఆధారంగా ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది.
- ఏదైనా సాధారణ డిగ్రీ ( UG) అభ్యసిస్తున్న వారికి సంవత్సరానికి 12 వేల రూపాయలు చొప్పున స్కాలర్షిప్ లభిస్తుంది.
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు మరియు ఇతర ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసిస్తున్న వారికి సంవత్సరానికి 20,000 చొప్పున స్కాలర్షిప్ లభిస్తుంది.
🔥How to Apply Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana Scheme :
- అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను అవకాశం కల్పించారు.
- ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది.
🔥 Pradhan Mantri Uchchatar Shiksha Protsahan Yojana Scheme Required Documents :
- SSC మార్క్స్ మెమో
- ఆధార్ కార్డు
- కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం
- నివాస ధృవీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- సదరం ధృవీకరణ పత్రం ( దివ్యాంగులు కి)
- విద్యార్థి , తల్లి , తండ్రి యొక్క పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- విద్యార్థి యొక్క సంతకం
- ఇంటర్/ తత్సమాన అర్హత సర్టిఫికెట్
- ఇతర ధ్రువపత్రాలు
🔥 Important Date :
- స్కాలర్షిప్ అధికానికి ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 31/10/2025