నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చి స్టైఫండ్ కూడా ఇస్తారు | Free Coaching

ఉచిత శిక్షణ
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

రాష్ట్రంలో గల యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోటీ పరీక్షల నిమిత్తం ప్రభుత్వం ద్వారా ఉచితంగా శిక్షణ కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయులు ఒక ప్రకటనలో వివరాలు తెలియచేశారు.

ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచిత శిక్షణ :

  • ఎస్సీ మరియు ఎస్టీ నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షల నిమిత్తం ఉచిత శిక్షణ అందించనుంది.
  • ఈ శిక్షణ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) , స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) , బ్యాంక్ పిఓ మరియు ఏపీపీఎస్సీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
  • ఇందుకుగాను ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా ఈ ఉచిత శిక్షణను ఇవ్వనున్నారు.
  • రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి , విశాఖపట్నం కేంద్రాల్లో ఈ శిక్షణ ఇస్తారు.
  • ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటుగా స్టైఫండ్ కూడా లభిస్తుంది.
  • అతి త్వరలో ఈ శిక్షణకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తామని, నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి గారు తెలిపారు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!