ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం కి సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. అన్నదాత సుఖీభవ పథకం కి ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలలో గల వ్యవసాయ సహాయకుని గ్రీవెన్స్ నిమిత్తం సంప్రదించాలి అని తెలిపిన విషయం తెలిసిందే. అయితే గ్రీవెన్స్ నమోదు చేసేందుకు గాను గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ వివిధ ప్రభుత్వ పథకాల సమాచారం మీ వాట్సాప్ నంబర్ కి రావాలి అంటే క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి వెంటనే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి..
✅ Join Our What’sApp Group – Click here
🔥అన్నదాత సుఖీభవ పథకం గ్రీవెన్స్ నమోదు తేదీ పొడిగింపు :
- అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు గారు అన్నారు.
- ఇప్పటికీ గ్రీవెన్స్ నమోదు ప్రక్రియ ప్రారంభం అయ్యిందని , ఇంకా ఎవరైనా అర్హత కలిగిన లబ్ధిదారులు పేర్లు అర్హుల జాబితాలో లేకపోయినా & అర్హులు అయి ఉండి అనర్హుల జాబితాలో ఉన్నా వారు సంబంధిత సచివాలయం లో గల రైతు సేవా కేంద్రాలలో ఉన్న వ్యవసాయ సహాయకులకు సంప్రదించాలి.
- గ్రీవెన్స్ నమోదు కొరకు గడువు పెంచామని, ఈ నెల 23 వ తేదీ లోపుగా గ్రీవెన్స్ నమోదు చేసుకోవాలని తెలియచేశారు.
🔥మరికొద్ది రోజులలో అర్హులందరికీ అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ:
- రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
- అర్హత కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వాటా గా 5,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు అతి త్వరలో జమ చేయనున్నారు.
- రైతుల పేర్లు సరిచూసుకుని వనమిత్ర అప్ లో డేటా నవీకరిస్తున్నారు.
- వెబ్ ల్యాండ్ లో పేరు లేని వారు , ఇటీవల భూమి కొనుగోలు చేసిన వారు మరియు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా వారు రైతు సేవా కేంద్రాలను సంప్రదించి వారి సందేహాలు నివృత్తి చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.
- ఈ నెల చివరి లోగా పథకం నిధులు జమ అయ్యే అవకాశం ఉంది అని అధికారిక సమాచారం లభిస్తుంది..
సులభంగా అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకోండి :
- అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ సర్వీస్ నంబర్ 95523 00009 కు మెసేజ్ పంపించి ఆధార్ నెంబర్ నమోదు చేయడంతో పథకం స్టేటస్ తెలుసుకోవచ్చు.
- కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం 155251 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.
- https://annadathasukhibhava.ap.gov.in/know-your-status అనే లింకు పైన క్లిక్ చేసి అన్నదాత ఆధార్ నెంబర్ నమోదు చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు..
- రైతులు తమ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో సంప్రదించి కూడా అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకోవచ్చు. రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకున్ని సంప్రదించి స్టేటస్ తెలుసుకోవడం మాత్రమే కాకుండా గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది.