ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NTR భరోసా పెన్షన్ల పథకంలో భాగంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారా ? అనధికారిక వర్గాల నుండి అవుననే సమాధానం లభిస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా 5 లక్షల పెన్షన్లు మంజూరు చేసే అవకాశం కనిపిస్తుంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కాలం పూర్తి అవ్వడం తో రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన – తొలి అడుగు అనే కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో ప్రజల నుండి పెన్షన్ల విషయమే అధికంగా వినతులు వస్తుండడం తో పెన్షన్లు మంజూరు విషయమే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది.
✅ Join Our What’sApp Group – Click here
🔥NTR భరోసా పెన్షన్ల పథకం – కొత్తగా 5 లక్షల పెన్షన్లు మంజూరు – కేబినెట్ భేటీ :
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం 63.32 లక్షల మందికి NTR భరోసా పెన్షన్ పథకం పేరుతో సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 2722 కోట్లను ప్రతీ నెలా కేటాయిస్తుంది.
- కొత్తగా అన్ని విభాగాలలో కలిపి మరో 5 లక్షల పెన్షన్లు ను మంజూరు చేయనుంది.
- ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల పెన్షన్లు మంజూరు చేసేందుకు నిర్ణయించడం తో దీని కొరకు 227 కోట్లు కేటాయించాలి.
- కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు గాను రాష్ట్ర కేబినెట్ ఈ నెల 24న భేటీ జరిపి నిర్ణయం తీసుకోనున్నారు.
🔥 శాంక్షన్ కానున్న స్పౌజ్ పెన్షన్లు :
- రాష్ట్రంలో చనిపోయిన పెన్షన్ దారుల భార్యలకు స్పౌజ్ ఆప్షన్ ద్వారా వితంతు పెన్షన్లు మంజూరు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
- ఇందులో భాగంగా 89 వేల పెన్షన్లు ను మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
- వీరికి పెన్షన్ మంజూరు కొరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పటికీ అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది.
- రాష్ట్ర కేబినెట్ భేటీ లో ఈ అంశం పై సృష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
🔥సుపరిపాలన – తొలి అడుగు లో పెన్షన్ల ప్రస్తావన :
- రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమం ను ప్రారంభించింది.
- క్షేత్రస్థాయిలో MLA లు, MP లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్న ఈ కార్యక్రమం లో ప్రజలు నుండి పెన్షన్లు మంజూరు కొరకు విజ్ఞప్తులు అధికంగా వస్తున్నాయి.
- ఈ అంశాన్ని కూడా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం తో ప్రభుత్వం కూడా ప్రజా ప్రతినిధుల యొక్క వినతులు పరిగణించి సానుకూల నిర్ణయం తీసుకోనుంది.