నిరుద్యోగ భృతి పథకం తాజా సమాచారం : ప్రదేశ్ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను క్రమంగా అమలు చేస్తూ వస్తుంది. అలానే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా లేని ఇతర పథకాలను కూడా అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది అని తెలియచేస్తున్నారు.
అలానే మరో మంచి పథకాన్ని ప్రారంభించనున్నట్లు దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు తెలియచేసారు.
✅ Join Our Telegram Group – Click here
🔥నిరుద్యోగ వేద పండితులకు నెలకు 3,000/-రూపాయలు నిరుద్యోగ భృతి :
- రాష్ట్రంలో నిరుద్యోగ వేద పండితులు కు నెలకు 3,000/-రూపాయలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలియచేసారు.
✅ ఈ ఉచిత స్కాలర్షిప్ టెస్ట్ రాసిన 150 మందికి 50,000/- గెలుచుకునే అవకాశం – Click here
- గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో 590 వేద పండితులు నిరుద్యోగులుగా ఉన్నారని , వీరికి నెలకు 3000/-రూపాయలు చొప్పున నిర్ణయించామని మంత్రి గారు తెలియచేసారు.
- అలానే టీటీడీ కాలేజీ మరియు పాఠశాల లలో ఖాళీగా ఉన్న 192 పోస్టులను ఒప్పంద లెక్చరర్ లతో భర్తీ చేయనున్నాం.
- ఇవి టీటీడీ , దేవాదాయ శాఖ సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అని మంత్రి గారు తెలియచేసారు..
