ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 13 వ తేదీన తల్లికి వందనం పథకం అమలు చేసి , లబ్ధిదారుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బుకు జమ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ పథకానికి వివిధ కారణాల వలన కొంత మంది అర్హత కలిగిన వారు కూడా అనర్హులు అయ్యి లబ్ది పొందేందుకు అవకాశం లేకుండా పోయింది.
వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ నమోదు కు అవకాశం కల్పించింది. గ్రీవెన్స్ నమోదు చేసుకున్న వారిలో అర్హత కలిగివున్న వారికి మరియు ఈ విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్న వారికి అలానే CBSE , నవోదయ , కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న వారికి రేపు అనగా 10వ తేదీన నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఆర్టికల్ చివర వరకు చదవగలరు.
🏹 ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయిపోండి..
✅ Join Our WhatsApp Group – Click here
🔥అర్హులకు రేపే తల్లికి వందనం నిధుల జమ :
- రాష్ట్రంలో తల్లికి వందనం నిధులు రెండవ విడత ఈనెల 10వ తేదీన విడుదల చేయనున్నారు.
- గతంలో మొదటి విడతలో భాగంగా లబ్ధిదారులకు డబ్బులు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాలు చేత అనర్హులుగా ఉన్నవారికి గ్రీవెన్స్ నమోదు ఆప్షన్ కల్పించి , అందులో అర్హత కలిగిన వారి అందరికీ కూడా 10వ తేదీన డబ్బులు జమ చేస్తామని గతంలోనే తెలియజేసింది.
- ఇప్పటివరకు వచ్చిన గ్రీవెన్స్ లు పరిష్కరించగా 1.34 లక్షల మంది అర్హులుగా తేలారు.
- వీరందరికీ ఒక్కొక్క విద్యార్థికి 13 వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేస్తారు.
🔥వీరు కూడా అర్హులే :
- తల్లికి వందనం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా రాష్ట్ర బోర్డులో ఉన్న ప్రతి విద్యార్థిని కూడా పథకంలో భాగంగా చూశారు. అయితే రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు సీబీఎస్ఈ సిలబస్ కలిగిన పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులను మినహాయించారు.
- అయితే రాష్ట్ర ప్రభుత్వం వీరిని కూడా అర్హులుగా పరిగణించి వీరందరికీ కూడా రేపే నిధులు జమ చేసింది గాను నిర్ణయించింది.
- వీరితో పాటుగా ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి అడ్మిషన్ తీసుకున్న వారికి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ అయినవారికి కూడా రేపే నిధులు జమ చేయనుంది.
🔥తల్లికి వందనం రెండవ అర్హుల జాబితా విడుదల !:
- తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి పెడతా అర్హులు జాబితా జూన్ 12వ తేదీన విడుదల చేయగా, రెండవ విడత అర్హులు జాబితాను ఈరోజు లేదా రేపు విడుదల చేసి అవకాశం కనిపిస్తుంది.
- వివిధ అంశాలను పరిగణించి మొత్తం 9.51 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాలలో ఒక్కొక్కరికి 13 వేల రూపాయలు చొప్పున నిధులు చేయనున్నారు.
- ఇందులో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 79,9410 మంది కాగా తల్లులు 78,4874 మంది ఉన్నారు. గ్రీవెన్స్ నమోదు చేసి అర్హత కలిగిన వారు 1.34 లక్షల మంది ఉన్నారు.
- వీరందరి జాబితాను కలిపి రెండవ విడత అర్హుల జాబితాను రూపొందిస్తారు.
🏹 తల్లికి వందనం రెండో విడత అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి :
తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మన మిత్ర వాట్సాప్ సర్వీస్ ఉపయోగించవచ్చు.