5,000 పెట్టుబడితో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ | Post Office Franchise Scheme Apply | Postal Department Post Office Franchise Scheme Full Details

Postal Franchise Scheme Apply
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

పోస్టల్ డిపార్ట్మెంట్ వారు కేవలం 5,000/- రూపాయల పెట్టుబడి తో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ (Post Office Franchise) ను ఇస్తున్నారు. 18 సంవత్సరాలు నిండి వ్యాపారం ప్రారంభిద్దాం అనుకునే వారు అందరికీ ఇది ఒక మంచి అవకాశం.

దేశంలో సాధారణ పోస్టల్ సేవలు అందించేందుకు గాను మొత్తం 1.55 లక్షల పోస్ట్ ఆఫీస్ లు ఉన్నప్పటికీ కూడా అంతకి మించిన పోస్టల్ సర్వీసులు అవసరం కన్పిస్తుంది. దీనికోసం పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక మంచి ఆశయంతో ముందుకు వచ్చింది.

దీనికి అనుగుణంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఈ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ ను తీసుకొని వచ్చారు.

ఈ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ స్కీమ్ కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? అవసరమగు విద్యార్హత ఏమిటి ? ఆదాయం ఏ విధంగా లభిస్తుంది. వంటి వివిధ అంశాల కొరకు ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

Join Our Telegram Group – Click here

🔥 పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ స్కీం అనగా ఏమిటి ? :

  • దేశంలో పోస్టల్ సర్వీస్ లను విస్తృతం చేసింది గాను పోస్టర్ డిపార్ట్మెంట్ వారు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ నడిపించేందుకు గాను పౌరులకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ రెండు రకాల ఫ్రాంచైజ్ లను అందిస్తుంది. అవి
  • 1.పోస్టల్ సర్వీసులు అవసరం అయి ఉండి , పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేయలేని చోట కౌంటర్ సర్వీసులు అందించేందుకు ఫ్రాంచైజ్ అవుట్ లెట్ లను ఓపెన్ చేయుట.
  • 2. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో పోస్టల్ ఏజెంట్స్ ద్వారా పోస్టల్ స్టాంప్స్ లు మరియు స్టేషనరీ అమ్ముకొనుట.

🔥 ఈ ఫ్రాంచైజ్ లను ప్రారంభించేందుకు ఎవరు అర్హులు ?:

  • ఈ ఫ్రాంచైజ్ పొందేందుకు గాను భారతీయ పౌరులు అయి వుండాలి.
  • 18 సంవత్సరాలు నిండి యుండి , 8 వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఫ్రాంచైజ్ పొందేందుకు అర్హులై ఉంటారు.
  • దరఖాస్తు దారులకు ఎటువంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉండరాదు.
  • చట్టబద్ధమైన వ్యాపార చిరునామా మరియు సంప్రదింపు నెంబర్ కలిగి వుండాలి.

🏹 ప్రభుత్వ బ్యాంకుల్లో 50,000/- ఉద్యోగాలు – Click here

🔥 పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ స్కీమ్ కు ఎంత ఖర్చవుతుంది ? :

  • పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్కీమ్ ద్వారా మీరు ఒక ఫ్రాంచైజీ పెట్టాలి అనుకుంటే మీ దగ్గర 5000 రూపాయలు ఉండాలి.
  • 5000 రూపాయలను డిడి రూపంలో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అనే పేరు మీద చెల్లించాలి.
  • మహిళలు, ఎస్సీ, ఎస్టీ దరఖాస్తుదారులు ఈ ఫీజు చెల్లించకుండా అప్లై చేసుకోవచ్చు.

🔥 పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ స్కీంకు ఎలా అప్లై చేయాలి :

  • పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ స్కీమ్ కోసం మీరు అప్లై చేయాలి అంటే క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ తో పాటు దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేయండి.
  • అప్లై చేసేముందు పూర్తి నోటిఫికేషన్ ఒకసారి చదవండి.
  • నింపిన దరఖాస్తు మరియు అవసరమైన సర్టిఫికెట్స్ తో మీకు దగ్గరలో ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీసును సంప్రదించండి.

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ స్కీం కమిషన్ వివరాలు :

  • పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ ద్వారా మీకు ఎలాంటి జీతం రాదు. మీరు అందించే సర్వీసులు ఆధారంగా కమిషన్ వస్తుంది.
  • స్పీడ్ పోస్ట్ ప్రతి బుకింగ్ కు ఐదు రూపాయలు కమిషన్ ఇస్తారు.
  • రిజిస్టర్డ్ పోస్ట్ ప్రతి బుకింగ్ కు మూడు రూపాయలు కమిషన్ ఇస్తారు.
  • ₹100 నుండి ₹200 రూపాయల వరకు మనీ ఆర్డర్ కు ₹3.50 రూపాయలు కమిషన్ ఇస్తారు.
  • 200 రూపాయలు పైన మనీ ఆర్డర్ కు ఐదు రూపాయలు కమిషన్ ఇస్తారు.
  • రిజిస్టర్డ్ మరియు స్పీడ్ పోస్ట్ సేవలు అందించినందుకు నెలకు అదనంగా 1000 రూపాయలు కమిషన్ ఇస్తారు.
  • పెరిగిన బుకింగ్ లకు అదనంగా 20% కమిషన్ ఇస్తారు.

Download Post Office Franchise Notification & Application – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!