ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పథకం అయిన RTC బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి ప్రారంభించనుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి , మహిళల సాధికారత కొరకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా అతి త్వరగా ప్రారంభించనున్నారు.
అయితే ఈ ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని అమలు చేస్తే రాష్ట్రం లో గల ఆటో డ్రైవర్లకు ఆదాయం తగ్గే అవకాశం ఉండడం తో రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కూడా లబ్ధి చేకూరే విధంగా ఒక మంచి పథకాన్ని (Financial Assistance to Auto drivers) ప్రారంభించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది.
ఇందుకు సంబంధించి మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ స్కూల్ విద్యార్థులకు ప్రతీ సంవత్సరం 12,000/- స్కాలర్షిప్ పథకం – Apply Now
ప్రతి రోజు ప్రభుత్వ పథకాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూప్ వెంటనే జాయిన్ అవ్వండి.. మీ నెంబర్ ఎవరికీ కనిపించదు.
🔥 ఆగస్టు 15 నుండి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం : Auto Drivers Scheme
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న పథకం ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.
- పథకాన్ని పంద్రాగస్టు సందర్భంగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది.
- ఈ పథకం ఏ విధంగా అమలు చేయాలి అన్న విషయంపై మార్గదర్శకాలు ప్రభుత్వ అధికారుల చేత తయారు చేయిస్తున్నారు.
- మరికొద్ది రోజులలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు గాను జీవో కూడా విడుదల చేస్తారు.
🔥 ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం : ( AP Auto Drivers Scheme)
- బస్సులలో ఉచిత ప్రయాణం సంబంధించి ఈ పథకాన్ని అమలు చేసే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ పథకం తీరును గమనించింది.
- ఈ పథకం అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో గల ఆటో డ్రైవర్లకు ఉపాధి విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం గమనించిందని తెలుస్తుంది.
- కావున ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు గాను ఒక పథకాన్ని రూపొందించునున్నామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు.
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించే తేదీ ఆగస్టు 15 నాడే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయన సభావంగా ప్రకటించడం జరిగింది.