ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ శరవేగంగా జరుగుతుంది. జూన్ 1వ తేదీ నుండి రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా వివిధ కొత్త విధానాలను తీసుకువస్తున్నారు.
రేషన్ షాప్ ల ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభమైన జూన్ 1వ తేదీ నాడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బియ్యాన్ని వద్దు అనుకుంటారు వారికి నగదు బదిలీ (Direct benefit transfer) చేస్తామని తెలియజేశారు.
అలానే వృద్ధులకు మరియు దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ (Ration supply at door steps) చేస్తామని గతంలోనే తెలియజేయడం జరిగింది.
అలానే రేషన్ పంపిణీ వ్యవస్థలో మరో కొత్త విధానాన్ని కూడా జోడించేందుకు ప్రయత్నం యోచిస్తుంది. రేషన్ బియ్యం వద్దు అనుకునే వారికి అంతే మొత్తంలో ఇతర నిత్యవసర సరుకులు అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలను పరిశీలిస్తుంది.
ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాల కొరకు ఈ ఆర్టికలను చివరివరకు చదవగలరు.
🔥సక్రమంగా రేషన్ పంపిణీ కార్యక్రమం:
- రాష్ట్రంలో రేషన్ పంపిణీ సక్రమంగా జరుగుతుంది. రేషన్ షాప్ డీలర్లకు సరైన మార్గదర్శకాలను తెలియజేసి, ప్రభుత్వం మరియు అధికారులు కార్యక్రమాన్ని మానిటర్ చేస్తున్నారు.
- రేషన్ పంపిణీ కొరకు ప్రత్యేక ఆప్ ను తయారుచేసి , ఇందులో భాగంగా ప్రతి గంటకు రాష్ట్రవ్యాప్తంగా ఎంత రేషన్ పంపించడం జరుగుతుంది ఇప్పటివరకు ఎంత శాతం దాసరి పంపిణీ జరిగింది వంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తున్నారు.
🔥రేషన్ మాఫియా ఆట కట్టు :
- రాష్ట్ర ప్రభుత్వం రేషన్ మాఫియాను అరికట్టడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుంది.
- గతంలో MDU వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసేటప్పుడు అధిక భాగం రేషన్ దళారుల చేతుల్లోకి వెళ్ళేది.
- ప్రభుత్వం రేషన్ మాఫియాను అరికట్టడానికి కట్టుబడి ఉంది తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా పూర్తిస్థాయి రేషన్ మానిటరింగ్ జరుగుతుంది.
- ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ పేదల కొరకే అయినా 70% పైగా రేషన్ బ్లాక్ మార్కెట్ కి చేరుకుంటుంది. వేలకోట్లతో కూడుకున్న ఈ రేషన్ మాఫియాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నా వారికి నగదు బదిలీ చేస్తే రేషన్ మాఫియా వారికి అడ్డుకట్ట పడినట్లే.
🏹 మహిళలతో పాటు పురుషులలో వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం – Click here
🔥రేషన్ కు బదులుగా నిత్యావసరాలు:
- రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీలో భాగంగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.
- రేషన్ బియ్యం వద్దు అనుకుంటున్నా వారికి ఆ రేషన్ బియ్యానికి బదులుగా , ఆ మొత్తానికి సరిపడా ఇతర నిత్యవసర సరుకులను అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విధానాలను తయారు చేస్తోంది.
- ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వివిధ అంశాలను పరిశీలించి అధ్యయనం చేస్తుంది.
- ఈ అంశానికి సంబంధించి గతంలోనే తొలి అడుగు పడినప్పటికీ , ఇప్పుడు ఈ అంశానికి మరింత ప్రాధాన్యతనిస్తూ రేషన్ కి బదులుగా నిత్యవసర సరుకుల పంపిణీ ప్రజలు కూడా ఆమోదిస్తారు అనే నమ్మకంతో ప్రభుత్వం రేషన్ కార్డు దారులందరి అభిప్రాయానికి తీసుకొని ఈ విధానాన్ని అమలు చేయనుంది.