ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల రెవెన్యూ శాఖ పై సమీక్ష నిర్వహించిన సందర్భంగా కేవలం 100/- రూపాయలు కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రకటించారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వారి భూమి పై చట్టబద్ధమైన హక్కు కల్పించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను అమలు చేయాలని భావిస్తుంది.
🏹 ఏపీ లో పదో తరగతి అర్హతతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా చేస్తారు ? ఎక్కడ చేస్తారు ? అవసరమగు పత్రాలు ఏమిటి? రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధముగా ఉంటుంది ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ Join Our What’sApp Group – Click here
🔥 వారస్వత భూముల రిజిస్ట్రేషన్ పథకం :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను రాష్ట్ర ప్రభుత్వం సరళతరం చేసింది. గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లు , తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా గ్రామ, వార్డు సచివాలయం లలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధంగా అవకాశం కల్పించనుంది.
- ఈ పథకం ద్వారా వారసత్వ భూములను చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు.
- రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకం గా అమలు చేయనుంది.
- వారసత్వ రిజిస్ట్రేషన్ చేయడం వలన భూ వివాదాలను తగ్గించవచ్చు మరియు ప్రభుత్వ రికార్డులలో తప్పులను సరిచేయవచ్చు.
🔥వారస్వత భూముల రిజిస్ట్రేషన్ పథకం అమలు చేయు విధానం & స్టాంప్ డ్యూటీ వివరాలు :
- వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను గ్రామ, వార్డు సచివాలయం లను వేదిక గా చేసుకొని అమలు చేయనున్నారు.
- ఇందుకు గాను గ్రామ, వార్డ్ సచివాలయం సిబ్బందికి ట్రైనింగ్ నిర్వహించి , రాబోయే రెండు మూడు నెలలలో ఈ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది.
- సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి రిజిస్ట్రేషన్ కొరకు వెళ్లవలసిన అవసరం ఉండదు.
- భూమి మొత్తం విలువ 10 లక్షల లోపు ఉంటే కేవలం 100/- రూపాయలు స్టాంప్ డ్యూటీ చెల్లించవలసి ఉంటుంది.
- అలానే భూమి విలువ 10 లక్షల కంటే అధికంగా ఉంటే 1000/- రూపాయలు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి.
- భూమి యొక్క మార్కెట్ విలువను సబ్ రిజిస్టర్ కార్యాలయం వారు నిర్ధారిస్తారు.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో భాగంగా వారసులు వారి యొక్క భూ వివరాలు మరియు సంబంధిత ధృవపత్రాలను తీసుకొని వెళ్ళ వలసి ఉంటుంది.
- సచివాలయం సిబ్బంది వారసుల ధ్రువపత్రాలు పరిశీలించి , వారి యొక్క EKYC నమోదు చేస్తారు.
- ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మళ్ళీ మ్యుటేషన్ కొరకు దరఖాస్తు చేయవలసిన అవసరం ఉండదు . ఆటోమేటిక్ మ్యుటేషన్ విధానం ద్వారా మ్యుటేషన్ జరుగుతుంది.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు మ్యుటేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ పాస్ బుక్ ను పొందవచ్చు.
